Breaking News

తండ్రిని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించిన నాగ శౌర్య .. కారణం ఏంటి ?

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ప్రజెంట్ ‘వరుడు కావలెను’ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సంగతి అలా ఉంచితే.. నాగశౌర్య పేరిట ఉన్న హైదరాబాద్ సిటీ శివారులోని మంచిరేవుల ప్రాంతంలో ఇటీవల పోలీసులు తనిఖీలు చేశారు. ఆ తనిఖీల్లో మంచిరేవుల ప్రాంతంలోని ఫాం హౌస్‌లో 30 మంది పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. ఈ విషయమై గచ్చిబౌలి, పంజాగుట్ట, కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కాగా, ఈ కేసు విషయమై హీరో నాగశౌర్య తండ్రి పోలీస్ స్టేషన్‌కు రానున్నారు.

పేకాట ఆడుతున్న 30 మందిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ప్రధాన నిందితుడు గుత్తా సుమన్‌ను మినహాయించి మిగతా 29 మందికి ఉప్పర్‌పల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఫామ్ హౌస్ రెంటల్ అగ్రిమెంట్స్ తీసుకురావాలని హీరో నాగశౌర్య తండ్రి రవీంద్రప్రసాద్‌ను పోలీసులు ఆదేశించారు. దాంతో రవీంద్రప్రసాద్ డాక్యుమెంట్స్ తీసుకుని పోలీసుల వద్దకు రానున్నారు. ఆల్రెడీ పోలీసులు రెండు రోజుల నుంచి ప్రధాన నిందితుడు సుమన్‌ను పలు విషయాలపై ప్రశ్నిస్తున్నారు. పేకాట శిబిరంపై పోలీసుల మెరుపుదాడి ద్వారా ఈ విషయాలు బయటకు వచ్చాయి. జూదం నిర్వహిస్తున్న తీరును తెలుసుకునేందుకుగాను పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. లక్షలు కుమ్మరించి చాలా మంది సెలబ్రిటీలు, బడానేతల తనయులు పేకాట ఆడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ వివరాలు తెలుసుకునేందుకుగాను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పేకాట శిబిరంపై దాడిలో ప్రధాన నిందితుడు సుమన్ రెండు రోజుల కస్టడీ కింద పోలీసులకు ఉప్పరవల్లి కోర్టు అప్పగించింది. ఈ కేసు విచారణ ద్వారా పలు సంచలన విషయాలు బయటకు వచ్చే చాన్సెస్ ఉన్నాయి. పేకాట శిబిరంపై దాడి సంరద్భంగా పోలీసులు రూ.6 లక్షల నగదు, క్యాష్ స్వైపింగ్ మెషిన్లు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. నాగశౌర్య తండ్రి పేరు మీద మంచిరేవులలో ఫామ్ హౌస్ ఉంది. ఇకపోతే ప్రధాన నిందితుడు గుత్తా సుమన్ పేకాట శిబిరాలతో బాగా పాపులర్ అయి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా అవతారమెత్తాడు.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *