Breaking News

డ్ర‌గ్స్ అమ్ముతున్న సింగం మూవీ విల‌న్‌.. రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్న పోలీసులు

మ‌న‌కు సాధార‌ణంగా డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా అన‌గానే నైజీరియానే గుర్తుకు వ‌స్తుంది. నైజీరియా నుంచి డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రాల మీద ఇప్ప‌టికే చాలా సినిమాలు వ‌చ్చాయి. ఇ త‌మిళ స్టార్ హీరో సూర్య న‌టించిన సింగం మూవీ కూడా ఇలాంటిదే. అయితే ఈ మూవీలో చెక్ వుమె మాల్విన్ అనే నైజీరియన్ కు చెందిన వ్య‌క్తి సూర్య మూవీలో డ్రగ్స్ సప్లై చేసే ముఠా స‌భ్యుడిగా క‌నిపించిన విష‌యం అంద‌రికీ విదితమే. అయితే సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా ఆయ‌న డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తుండ‌గా పోలీసులు ప‌ట్టుకున్నారు. ఇక అత‌డి ద‌గ్గ‌రి నుంచి పోలీసులు పెద్ద ఎత్తున‌ డ్రగ్స్ స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు.

ఓ ప‌క్క మూవీ ఇండస్ట్రీల్లో డ్రగ్స్ ఆరోప‌ణ‌లు ప్ర‌కంప‌న‌లు రేపుతున్న స‌మ‌యంలో ఇది జ‌ర‌గ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. మన తెలుగు ఇండ‌స్ట్రీకి చెందిన ప్రముఖులు కూడా ఈడీ ముందు హాజ‌ర‌యిన విష‌యం పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కాగా ఈడీ విచార‌ణ‌లో దాదాపు అంద‌రికీ క్లీన్ చిట్ వ‌చ్చిన విష‌యం బ‌హిర్గ‌త‌మే. ఇక ఇప్పుడు సూర్య మూవీ విల‌న్ ఇలా దొరికిపోయాడు. ఈయ‌న 2013లో హరి డైరెక్ష‌న్ లో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా అయిన సింగం-2లో మెయిన్ విలన్ అయిన డానికి రైట్ హ్యాండ్ లాగా సపోర్టింగ్ క్యారెక్టర్ లో న‌టించాడు.

అయితే ఈయ‌న వ్యాపారుల‌తో పాటు కాలేజీ స్టూడెంట్ల‌కు సీక్రెట్ గా డ్ర‌గ్స్ అమ్ముతున్న‌ట్టు గుర్తించిన బెంగుళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపుగా 15 గ్రాముల ఎమ్‌డీ ఎమ్ఏతో పాటుగా 250 మిల్లీలీటర్ల హ్యాష్ ఆయిల్ ను ప‌ట్టుకున్నారు పోలీసులు. కాగా ఈ విధంగా స్వాధీనం చేసుకున్న ముడి స‌రుకుల విలువ రూ.15 లక్షల దాకా ఉండే ఛాన్స్ ఉంద‌ని స‌మాచారం. ఇంకో విష‌యం ఏంటంటే మాల్విన్ ద‌గ్గ‌రి నుంచి చాలా మంది కాంటాక్ట్ నెంబర్స్ పోలీసులు గుర్తించారు. ఇక వారిపై కూడా నిఘా పెట్టారు పోలీసులు. కాగా మాల్విన్ చాలా సినిమాల్లోనే న‌టించాడు. ఇంకా చెప్పాలంటే దాదాపు అన్ని సినిమాల్లో కూడా డ్ర‌గ్స్ అమ్మే వాడిగానే క‌నిపించాడు. మ‌రి ఆయ‌న సినిమాల్లోకి రాక‌ముందే డ్ర‌గ్స్ అమ్మే అల‌వాటు ఉందా లేక సినిమాల్లోకి వ‌చ్చాక ఇలా చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *