Breaking News

డబ్బులు కోసం ఇంతలా దిగజారిపోవాలా రెజీనా… సోషల్ మిడిల్ లో ఆటాడుకుంటున్న నెటిజన్లు..

తెలుగు సినిమా పరిశ్రమలో పలు సినిమాలు చేసినా అనుకున్నంత స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేదు.. అందాల తార రెజీనా. రొటీన్ లవ్ స్టోరీ సినిమాతో తెలుగు వెండి తెరకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత పలు సినిమాలు చేసింది. తన నటనతో పాటు అందంతో తెలుగు జనాలకు బాగా దగ్గరయ్యింది. శివ మనసులో శృతి, కొత్త జంట, పిల్లా నువ్వు లేని జీవితం, జో అచ్యుతానంద సినిమాల్లో చక్కటి నటన కనబర్చింది. అయినా ఈమె అనుకున్నంత స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేదు. తాజాగా ఈమె ఈ బ్యూటీ నేనేనా? అనే ఓ హార్రర్ మూవీలో నటిస్తోంది. అటు ఓ వెబ్ సిరీస్ లో కూడా యాక్ట్ చేస్తుంది. రాజ్-డీకే క్రేజీ ప్రాజెక్టులో ఈ అమ్మడు అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ లో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నాడట. బాలీవుడ్ టాప్ హీరో షాహిద్ కపూర్ కూడా ఓ పాత్ర చేస్తున్నాడట.

అటు ఇప్పటికే పలు బ్రాండ్ల యాడ్స్ లో నటించిన రెజీనా.. తాజాగా మరో బ్రాండ్ ప్రమోషన్ యాడ్ లో యాక్ట్ చేసింది. అంతేకాదు.. ఈ బ్రాండ్ కు అంబాసిడర్ గా కూడా పని చేస్తుంది. అదే ఆమెకు తీవ్ర తలనొప్పులు తెచ్చిపెట్టింది. సోషల్ మీడియాలో ఓ రేంజిలో ట్రోలింగ్ కు గురయ్యింది. ఇంతకీ తనను ఇబ్బంది పెట్టిన ఆ బ్రాండ్ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

కొద్ది రోజుల క్రితం ఆమె ఇన్ స్టా గ్రామ్ లో ఓ పోస్టు పెట్టింది. తాను 98 సంవత్సరాల వయసులోనే యాంకరింగ్ మొదలు పెట్టినట్లు చెప్పింది. ప్రస్తుతం పలు కమర్షియల్ సినిమాల్లో నటిస్తున్నట్లు వెల్లడించింది. వీటితో పాటు కొన్ని ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడార్ గా వ్యవహరించాలి అనుకుంటున్నట్లు చెప్పింది. ఈ సంతోషాన్ని సిగ్నేచర్ తో సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు వెల్లడించింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. డబ్బుల కోసం మద్యాన్ని ప్రమోట్ చేస్తారా? అంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *