Breaking News

టాలీవుడ్ హీరో, హీరోయిన్స్ బోర్ కొడితే ఏం చేస్తారో తెలుసా?

ప్రస్తుత బిజీ లైఫ్‌లో మనిషికి పని ఒత్తిడి, టెన్షన్స్ సైతం పెరిగిపోయాయి. వీటి నుంచి కాస్త రిలీఫ్ అయ్యేందుకు వారు ఎంచుకునే మొదటి ఆప్షన్ సినిమా.. అవునండి సినిమా చూడటం వల్ల అన్ని టెన్షన్ల నుంచి కాస్త రిలీఫ్ పొందొచ్చు. మరీ ఆ సినిమాల్లో నటించే హీరో, హీరోయిన్స్, టెక్నీషియన్స్‌కు బోరు కొడితే వారు ఏం చేస్తారో తెలుసా..? అయితే తెలుసుకుందాం పదండి.

పవన్ కళ్యాణ్.. ఈ పేరు వింటే ఆయన ఫ్యాన్స్‌లో ఎక్కడా లేని కిక్కు వస్తుంది. రెచ్చిపోయి వారు చేసే హంగామా అంతా ఇంతా కాదు. అయితే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయానికి వస్తే ఆయనకు ఎప్పుడూ బోర్ కొట్టదట. ఎందుకు ఆయన ఎక్కువ సమయం పుస్తకాలు చదవడానికి కేటాయిస్తారు. మరీ ఎక్కువగా బోర్ కొడితో తన ఫామ్‌హౌజ్‌కు వెళ్లి వ్యవసాయానికి సంబంధించి ఏదో పని చేస్తుంటారు. ఇక మరో హీరో సూపర్ స్టార్ మహేశ్‌బాబు. ఖాళీ సమయం దొరికితే పుస్తకాలు చదివే ఈయన.. ప్రస్తుతం ఖాళీ దొరికితే తన కొడుకు, కూతురితో మాట్లాడుతూ పలు విషయాలు తెలుసుకుంటాడట. అప్పడప్పుడు వారితో కలిసి ఫారన్ ట్రిప్‌కు వెళతారు. ఇక ప్రభాస్ గురించి చెప్పాలంటే ఆయనకు అసలు బోరు కొట్టదట. ఎందుకంటే ఆయన ఎప్పుడూ తన స్నేహితులకు దగ్గరగా ఉంటారట. సినీ ప్రొడ్యూసర్‌తో సహా ఇండస్ట్రీలో చాలా మంది ప్రభాస్ స్నేహితులే కావడం విశేషం. ఇక బాలయ్య విషయానికి వస్తే.. ఆయనకు బోర్ కొడితే తన చిన్ననాటి ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి మాట్లాడతారట.. తన ఇంట్లో పనిచేసే వారితో సైతం మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకుని తనకు తోచిన సాయం చేస్తారట. ఇక నాగార్జనకు బోర్ కొడితే ఆయన తండ్రి నాగేశ్వర్ రావు నటించిన చిత్రాలను ప్రైవేట్ థియేటర్లలో పొజెక్టర్ వేసుకుని చూస్తారట. ఇక కమెడియన్ బ్రహ్మానందానికి బోర్ కొడితే మట్టితో విగ్రహాలు చేస్తారట.. హీరో వెంకటేశ్‌కు బాగా బోర్ కొడితే ఆయన ధ్యానం చేస్తారట. హీరోయిన్ అనుష్కకు బోర్ కొడితే కుక్క పిల్లలతో సమయం గడుపుతుందట.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *