Breaking News

టాలీవుడ్ టాప్ హీరోల డెబ్యూ టైంలో ప్రస్తుత హీరోయిన్ల వయసెంతో తెలుసా ?

సినిమా హీరోలతో పోల్చితే హీరోయిన్ల కెరీర్ టైం చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. హీరోలుగా మూడు నాలుగు దశాబ్దాల పాటు కంటిన్యూగా చేసిన వాళ్లు ఉన్నారు. హీరోయిన్లు అయితే.. మహా అంటే ఓ 10 ఏండ్ల వరకు సత్తా చాటగలరు. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరం అవుతారు. లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కొనసాగుతారు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలుగా కొనసాగుతున్న వారి డెబ్యూ మూవీ సమయంలో చిన్న అమ్మాయిలుగా ఉన్న వారు.. ప్రస్తుతం అదే హీరోల సరసన హీరోయిన్లుగా చేశారు. ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

* అల్లు అర్జున్-పూజా హెగ్డే- అలవైకుంఠపురములో
అల్లు అర్జున్, పూజా హెగ్డే కలిసి నటించిన తాజా సినిమా అలా వైకుంఠపురములో. ఈ సినిమాతో మంచి హిట్ కొట్టారు. అయితే అల్లు అర్జున్ డెబ్యూ మూవీ గంగోత్రి చేసిన సమయంలో పూజా వయసు 13 సంవత్సరాలు మాత్రమే.

*మహేష్ బాబు- రశ్మిక మందాన- సరిలేరు నీకెవ్వరు
మహేష్ బాబు 1999లో రాజ కుమారుడు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అప్పుడు రశ్మిక మందాన వయసు కేవలం 3 సంవత్సరాలు.. 2020 వచ్చే సరికి ఇద్దరు కలిసి సరిలేరు నీకెవ్వరు సినిమా చేశారు.

*రవితేజ- పాయల్ రాజ్ పుత్- డిస్కో రాజా
రవితేజ, పాయల్ రాజ్ పుత్ కలిసి నటించిన హిట్ మూవీ డిస్కో రాజా. అయితే రవితేజ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టే నాటికి పాయల్ వయసు 7 సంవత్సరాలు.

*రాంచరణ్- కైరా అద్వానీ- వినయ విధేయ రామ
కైరా అద్వానీ, రాంచరణ్ కలిసి నటించిన సినిమా వినయ విధేయ రామ. అయితే చెర్రీ చిరుత సినిమాతో 2007లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అప్పుడు కైరా వయసు 15 సంవత్సరాలు.

*ప్రభాస్- శ్రద్ద కపూర్- సాహో
ప్రభాస్, శ్రద్ధ కపూర్ కలిసి నటించిన పాన్ ఇండియన్ మూవీ సాహో. బాహుబలి తర్వాత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కినా అనుకుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. అటు ప్రభాస్ తొలి మూవీ ఈశ్వర్ సమయంలో శ్రద్ధ వయసు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే.

*నాని- ప్రియాంక- గ్యాంగ్ లీడర్
నేచురల్ స్టార్ నాని, ప్రియాంక కలిసి నటించిన హిట్ మూవీ గ్యాంగ్ లీడర్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అయితే నాని తొలి సినిమా అష్టాచెమ్మా సమయంలో ప్రియాంక వయసు 14 సంవత్సరాలు.

*జూ. ఎన్టీఆర్- పూజా హెగ్డే- అరవింద సమేత
జూనియర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే కలిసి నటించిన సూపర్ డూపర్ హిట్ మూవీ అరవింద సమేత. అయితే జూనియర్ 2001లో వచ్చిన డెబ్యూ మూవీ సమయంలో పూజా వయసు కేవలం 11 ఏండ్లు మాత్రమే.

*పవన్ కల్యాణ్- కీర్తి సురేష్- అజ్నాతవాసి
పవన్, కీర్తి కలిసి నటించిన హిట్ మూవీ అజ్నాతవాసి. అటు పవన్ కల్యాన్ డెబ్యూమూవీ సమయంలో కీర్తి వయసు కేవలం 4 సంవత్సరాలు మాత్రమే.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *