Breaking News

టాలీవుడ్ కి బిగ్ షాక్ : ఆసుపత్రిలో కోన ఊపిరి తో కొట్టుమిట్టాడుతున్న కైకాల సత్యనారాయణ

టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఇటీవల తన ఇంట్లో జారిపడ్డారు. శనివారం రాత్రి అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కైకాలను కుటుంబ సభ్యులు సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వార్తలు వస్తున్నాయి. కాగా, కైకాల ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.

ఇకపోతే వయసు పరిమితుల దృష్ట్యా కైకాల ఇంటికే పరిమితమయిన సంగతి తెలిసిందే. కాగా, కైకాల చివరిసారిగా తెలుగు ప్రేక్షకులకు మహేశ్ బాబు ‘మహర్షి’ సినిమాలో కనిపించారు. ఈ చిత్రానికి ముందర ‘ఎన్టీఆర్..కథానాయకుడు’ చిత్రంలో ఓ పాత్ర పోషించారు. నవరస నటనా సార్వభౌమగా పేరుగాంచిన కైకాల సత్యనారాయణ.. సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. నందమూరి తారకరామారావుకు డూప్‌గానూ నటించారు. దాదాపుగా 750 చిత్రాల్లో నటించిన కైకాల బహుముఖ ప్రజ్ఞాశాలి. పదకొండో లోక్ సభ సభ్యుడిగా మచిలీపట్నం నియోజకవర్గం నుంచి కైకాల సత్యనారాయణ ఎన్నికయ్యారు. టీడీపీ తరఫున కైకాల పోటీ చేసి గెలుపొందారు. విలన్ పాత్రలతో పాటు సపోర్టింగ్ రోల్స్ ప్లే చేస్తూ ముందుకు సాగాడు. పౌరాణిక పాత్రలు అయితే ఎన్టీఆర్ తర్వాత కైకాల సత్యనారాయణే అనేంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. పరమేశ్వురుడిగా, కర్ణుడిగా, రావణుడిగా విభిన్నమైన పాత్రలు పోషించి తెలుగు తెరపైన తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్నారు కైకాల. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ హయాంలో భీకర్ విలన్ పాత్రలు పోషించిన కైకాల కమెడియన్‌గానూ రాణించారు. తెలుగు సినిమా ఆణిముత్యం అయిన కైకాల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్న వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. అయితే, ఇది స్వల్ప అస్థతతేనని కైకాల కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. అయితే, ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ హాస్పిటల్ నుంచి ఇంకా రాలేదు. ఇటీవల కైకాల జన్మదినం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కైకాల ఇంటికి వెళ్లి సర్‌ప్రైజ్ చేశారు. కైకాల ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని తెలుస్తోంది.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *