Breaking News

టాలీవుడ్‌లో మరో సెలబ్రిటీ జంట విడాకులు.. ? హీరో గారు ఇంటికి వెళ్లి చాలా రోజులు అయ్యిందట

టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్‌గా ఉన్న అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే, చాలా మంది సెలబ్రిటీలతో పాటు అక్కినేని వారి అభిమానులు నాగచైతన్య, సమంత విడిపోకుండా ఉండాల్సిందని అనుకున్నారు. కానీ, వారి కోరిక నెరవేరలేదు. ఎవరికి వారు సొంత దారుల్లో పయనమయ్యేందుకుగాను నాగచైతన్య, సమంత ఇద్దరూ సిద్ధమయ్యారు. అయితే, నాగచైతన్య, సమంత విడిపోతున్న విషయమై కేవలం టాలీవుడ్‌లో‌నే కాదు బాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా చర్చ జరిగింది.

టాలీవుడ్‌లో నాగచైతన్య, సమంత మాత్రమే కాదు చాలా మంది జంటలు విడిపోయిన వారు ఉన్నారు. కాగా అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోయిన తర్వాత సమంతపై సోషల్ మీడియాలో కొందరు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తీవ్రమైన ట్రోలింగ్ చేయడాన్ని సమంత ఖండించింది.
ఈ సంగతులు పక్కనబెడితే.. మరో టాలీవుడ్ యంగ్ హీరో విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ ప్రముఖవ్యక్తి కూతురిని వివాహం చేసుకున్న సదరు యంగ్ హీరో త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నాడని గుసగుసలు వినబడుతున్నాయి. అయితే, ఇలా విడాకులు తీసుకోవడానికి గల కారణాలు తెలియ రావడం లేదు. ఎవరి తప్పు వల్ల యంగ్ హీరో విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యాడనేది సస్పెన్స్‌గానే ఉంది. ఆ యువ హీరో ప్రజెంట్ రెండు సినిమాల్లో నటిస్తున్నాడని తెలుస్తోంది. అవి సెట్స్‌పైన ఉన్నాయని సమాచారం. ఇకపోతే పర్సనల్ లైఫ్‌లో ఏర్పడిన ఆటంకాల వల్ల సదరు హీరో ప్రజెంట్ షూటింగ్స్‌కు హాజరు కావడం లేదని, దాంతో ప్రొడ్యూసర్స్ ఇబ్బందులు పడుతున్నారని, ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుందని ఆందోళన చెందుతున్నారని సమాచారం. ఆ యువ హీరో గతంలో చాలా ఈవెంట్స్, సినిమా ఫంక్షన్స్‌కు హాజరయ్యే వాడట. కానీ వ్యక్తిగత జీవితంలో ఏర్పడిన డిస్ట్రబెన్స్ వల్ల ఆయన ఎక్కడికీ వెళ్లడం లేదట. అయితే, ఈ వార్తలు ఎంత వరకు నిజం అన్న విషయం తెలియాలంటే సదరు యువ హీరో స్పందించే వరకు ఆగాల్సిందే. ఆ టాలీవుడ్ యంగ్ హీరో ఎవరో అనే విషయమై ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో చర్చ కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *