Breaking News

జ‌య‌ల‌లిత ఒక మ‌ల‌యాళం డైరెక్ట‌ర్‌ను పెళ్లాడి, ఎన్ని కష్టాలు పడిందో తెలుసా?

సినిమాల్లో రాణించాలంటే అందం, అభినయమే కాదు… కాసింత అద్రుష్టం కూడా ఉండాలి. అప్పుడే సినిమాల్లో బాగా రాణించగలుగుతారు. చూడగానే ఆకట్టుకునే రూపం, అంతకు మించి నటనా శక్తి ఉన్నా.. కాలం కలిసి రాక వ్యాంప్ ఆర్టిస్టుగా మిగిలిపోయింది అందాల తార జయలలిత. ఒకప్పుడు క్లాసికల్ డ్యాన్సర్స్ గా పేరు సంపాదించిన చల్లా సిస్టర్స్ లో ఓ అమ్మాయే ఈ జయలలిత. ఆమె సినీ కెరీర్ విషయం ఎలా ఉన్నా.. వ్యక్తిగ జీవితం మాత్రం చాలా సమస్యలతో నిండిపోయింది.

సినిమాల్లో మంచి హవా ఉన్నప్పుడే జ‌య‌ల‌లిత వినోద్ అనే మ‌ల‌యాళం దర్శకుడిని పెళ్లి చేసుకుంది. ఆయన బీ గ్రేడ్ సినిమాలు ఎక్కువగా చేసేవాడు. ఆ సినిమాల్లో జయ లలిత కూడా నటించింది. అంతేకాదు.. వినోద్ తండ్రి జయదేవ్ కూడా మంచి దర్శకుడు. ఆయన సినిమాకు, దర్శకుడు క్రాస్ బెల్డ్ మణి సినిమాకు జయలలిత వాళ్ల నాన్న ఓ డేట్ ఇచ్చాడు. ఆ విషయం జయలలితకు తెలియదు. జ‌య‌దేవ‌న్ సినిమా షూటింగ్ కు జయ లలిత వెళ్లింది. అదే సమయంలో క్రాస్ బెల్డ్ మణి మనుషులు అక్కడికి వచ్చి నానా గొడవ చేశారు. మీనాన్న మాకు డేట్స్ ఇస్తే ఇక్కడికి ఎలా వస్తారు? అంటూ రచ్చేశారు.

అప్పడే వినోద్ అక్కడికి వచ్చి క్రాస్ బెల్ట్ మణి మనుషులతో మాట్లాడి విషయం సెటిల్ చేశాడు. ఆ సమస్య నుంచి తనను బయటపడేసిన వినోద్ హీరోలా కనిపించాడు. నన్ను కాపాడిన వాడితో జీవితాంతం ఉండాలి అనుకుంది. సుమారు ఏడు సంవత్సరాల పాటు తనతో ప్రేమలో ఉన్నారు. తనతో జాగ్రత్తగా ఉండాలని చాలా మంది చెప్పినా తను పట్టించుకోలేదు. ఆ సమయంలో తనకు ఎన్నో సినిమా అవకాశాలు వచ్చిన వదులుకుంది. తమ సినిమాల్లో చేయాలని దర్శక నిర్మాతలు ఫోన్లు చేసినా.. తను లేదని అబద్దం చెప్పి అవకాశాలు చేజార్చుకుంది. పెళ్లి తర్వాత తను వినోద్ తో ఎన్నో ఇబ్బందులు పడింది. చివరకు తన నుంచి విడిపోయి ఒంటరి జీవితాన్ని సంతోషంగా గడుపుతుంది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *