Breaking News

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ గా నిలుస్తున్నాయి. సూర్య ప్రముఖ నటుడు శివ కుమార్ వారసుడు. శివ కుమార్ 200 పై చిలుకు తమిళ సినిమాల్లో నటించినప్పటికీ తనకున్న ఆస్తినంతా వేరే వారికి దానం చేయడంతో తనకంటూ ఏమీ లేకుండా చేసుకున్నారు. అయినా కానీ శివకుమార్ కొడుకు సూర్య హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. రియల్ లైఫ్ స్టోరీలతో హిట్లు కొడుడుతున్న సూర్య వైవాహిక జీవితం గురించి ఒక సత్యం అభిమానులెవరకీ పెద్దగా తెలియదు.

సూర్య తన సహ నటి అయిన జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . ఈ జంటకు ఒక పాప, ఒక బాబు ఉన్నారు. వీరు చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారని అందరికీ తెలుసు. కానీ సూర్య జ్యోతికను రెండు సార్లు వివాహం చేసుకున్నాడని ఎవరికీ పెద్దగా తెలియదు. అవును సూర్యకు జ్యోతికకు రెండు సార్లు పెళ్లయింది. సూర్య జ్యోతిక చనువుగా ఉండడం చూసి వారు ప్రేమించుకుంటున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలు వచ్చినపుడు మొదట్లో ఈ జంట ప్రేమించుకోలేదట. ఈ వార్తలను విని సరదాగా నవ్వుకునే వారు. కానీ ఆ తర్వాత అటువంటి ప్రేమ వార్తలను నిజం చేస్తూ సూర్య జ్యోతిక ఒకరితో ఒకరు డీప్ ప్రేమలో మునిగిపోయారు. ప్రేమలో అయితే ఉన్నారు కానీ ఈ విషయం ఇంట్లో చెప్పేందుకు సూర్య భయపడ్డాడట. దీంతో ఇంట్లో చెప్పకుండా సూర్య జ్యోతికను వివాహం చేసుకున్నాడు. దీంతో చేసేదేం లేని ఇంట్లో వాళ్లు విషయం తెలిసిన తర్వాత మరో సారి పెళ్లయింది. ఇలా సూర్య జ్యోతికను రెండు సార్లు వివాహం చేసుకున్నాడు.

About Mamatha

Check Also

గొప్పలకు పోయి ఉన్న కాస్త పరువు పోగొట్టుకున్న సెలబ్స్ వీళ్ళే !

తెలుగు సినిమా పరిశ్రమలో నటీనటుల కంటే దర్శకులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అయితే ఆయా దర్శకులు పలు సినిమాలను భారీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *