Breaking News

జెస్సి కి వచ్చిన ఆ వ్యాధి ఏంటో తెలుసా? ఇంత తీవ్రంగా బాధ పడుతున్నాడా ?

బిగ్ బాస్ సీజన్-5 రోజు రోజుకు చాలా ఆసక్తికరంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే సగానికిపైగా కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్లలో కూడా చాలా మంది బాగా ఆడుతున్నారు. వారిలో జెస్సీ కూడా ఒకడు. హౌస్ లోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి ఆట తీరు కనబరుస్తున్నాడు. తాజాగా అతడికి ఓ వింత వ్యాధి వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్నాడు. హౌస్ లో బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు ఆడటం అటుంచితే.. సరిగా మాట్లాడలేకపోతున్నాడు. సరిగా నడవలేకపోతున్నాడు కూడా. అయితే తనకు వర్టిగో అనే వ్యాధి ఉన్నట్లు స్వయంగా ఆయనే వెల్లడించాడు.

చాలా రోజులు గడుస్తున్నా.. తనకు ఈ వ్యాధి తగ్గడం లేదు. పైగా రోజు రోజుకు ఆ వ్యాధి మరింత ముదురుతున్నట్లు తెలుస్తోంది. దీంతో బిగ్ బాస్ హౌస్ నుంచి తనను బయకు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. లేదంటే సీక్రెట్ రూమ్ లో అతడికి ట్రీట్మెంట్ ఇస్తారా? కాదంటే అటునుంచే ఇంటికి పంపిస్తారా? అనేది ఈ వారం తెలియదనుంది. షో హోస్ట్ నాగార్జున ఈ అంశంపై ఓ క్లారిటీ ఇవ్వనున్నాడు.

అయితే ఇంతకీ వర్టిగో అంటే ఏంటి? దాని మూలంగా ఎదురయ్యే సమస్యలు ఎలా ఉంటాయి? అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తల బాగా తిరగడాన్ని వర్టిగో అంటారు. నిజానికి ఈ వ్యాధి మహిళలలకు ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధి తీవ్రత పెరిగిన వారికి జాయింట్ వీల్ మీద తిరిగిన ఫీలింగ్ కలుగుతుంది. కళ్లు తిరగడంతో పాటు బ్యాలెన్స్ తప్పుతారు. గాల్లో తేలినట్లు అనిపిస్తుంది. చుట్టున్న వస్తువులు, మనషులు కూడా తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. అప్పుడప్పుడు తల తిరగడం, వాంతులు, సరిగా నడవలేకపోవడం జరుగుతుంది. అయితే ఈ లక్షణాలుంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాల్సి ఉంటుంది. ఈ సమస్యల తీవ్రం కావడం వల్ల ప్రాణానికి కూడా ఒక్కోసారి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. అందుకే ప్రాథమిక దశలోనే ఈ వ్యాధికి చికిత్స అవసరం.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *