Breaking News

జుట్టు ఊడేలా కొట్టిన నటి.. అయినా కూడ రవితేజ ?

తెలుగులో కామెడీ, యాక్షన్ సినిమాలు చేస్తూ మాస్ మహరాజ్ గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రవితేజ. సినిమా వేషాల కోసం మద్రాసు వెళ్లిన ఆయన.. చిన్న చిన్న పాత్రలు వేశాడు. ఆ తర్వాత హీరోగా ఎదిగాడు. నెమ్మదిగా హిట్ సినిమాల్లో నటిస్తూ.. బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాడు. ఆ తర్వాత వరుస విజయాలు అందుకుంటూ టాప్ హీరోగా ఎదిగాడు. విక్రమార్కుడు సినిమాతో తన కెరీర్ లో పీక్స్ కు వెళ్లాడు. ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో కనీవినీ ఎరుగని రీతిలో విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాలో తొలి భాగం అంతా రవితేజ దొంగ పాత్రలో కనిపిస్తాడు. రెండో భాగంలో పవర్ ఫుల్ పోలీస్ అధికారికగా కనిపిస్తాడు. ఈ రెండు క్యారెక్టర్లను అద్భుతంగా చేశాడు రవితేజ. ఇక ఈ సినిమాలో రవితేజ, జయ వాణి కలిసి కొట్టుకునే సీన్ ఒకటి ఉంటుంది. ఈ సీన్ లో అడవాళ్లతో రవితేజ కొట్లాటకు దిగుతాడు. జుట్లు పట్టుకుని కొట్లాడుకుంటారు. ఈ సీన్ ను ముందుగానే షూట్ చేశారు. అయితే ఈ సీన్ డైరెక్టర్ కు నచ్చలేదట. అందుకే దీన్ని తొలగించారట. ఈ సీన్ నచ్చితే ఉంచుతాం.. లేదంటే తొలగిస్తాం అని ముందే చెప్పి షూట్ చేశారట. అయితే హీరోని ఆడవాళ్లు కొడితే జనాలు ఒప్పుకోరు అని చెప్పిందట జయ వాణి.

కానీ రవితేజ.. ఈ సీన్ గురించి జయ వాణితో మాట్లాడాట. ఈ సీన్ తనకు చాలా నచ్చిందని చెప్పాడట. ఈ సీన్ లో మీరు నన్ను కొట్టండి. నేన మిమ్మల్ని కొడతాను అని చెప్పాడట. ఇక్క ఎవరూ ఈగోలకు పోవాల్సిన అవసరం లేదు అన్నాడట. ఈ సన్ని వేషం గురించి అందరూ చర్చించిన తర్వాతే దీన్ని షూట్ చేశారట. అయితే ఈ షూటింగ్ కొనసాగే సమయంలో రవితేజను జుట్టు పట్టుకుని కొట్టిందట జయ వాణి. అప్పుడు రవితేజ జుట్టూ ఊడి తన చేతిలోకి వచ్చిందట. కానీ రవితేజ ఎక్కడా ఫీలవలేదని చెప్పింది.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *