Breaking News

జర్మనీలో రోదిస్తున్న కూతురు.. ఆమె వచ్చాకే పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు..

తీవ్ర గుండె పోటుతో కన్నుమూసిన కన్నడ టాప్ హీరో పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ఎల్లుండి నిర్వహించాలని ఆయన కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. జిమ్ లో వ్యాయామం చేస్తున్న సమయంలో ఆయనకు తీవ్ర గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో ఆయనకు డాక్టర్లు చికిత్స అందించారు. ఆస్పత్రికి వచ్చే సమయానికే ఆయన పరిస్థితి విషమించినట్లు డాక్టర్లు చెప్పారు. అయినా వారి ప్రయత్నం వారు చేశారు. కానీ ఆయనను కాపాడాలేకపోయారు. దీంతో కన్నడ సినిమా పరిశ్రమ అంతా కంటనీరు పెట్టుకుంది. ఆయన సన్నిహితులు, మిత్రులు, తోటి నటులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

నేత్రదానానికి ఆయన అంగీకారం చెప్పడంతో.. తను చనిపోయిన తర్వాత చికిత్స పొందిన ఆస్పత్రిలోనే కళ్లను తీసుకున్నారు డాక్టర్లు. ఆయన చికిత్స తీసుకుంటున్న సమయంలో అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు నేత్రదానం సమయంలో మాత్రం ఎవరూ లేరు. ఆ తర్వాత ఆస్పత్రి నుంచి ఆయన బాడీని సదాశివ నగర్ లోని ఇంటికి తీసుకువచ్చారు. ముందుగా అంబులెన్స్ వస్తుండగా దాని వెనుక ఆయన అభిమానులు ఎంతో మంది బైకులతో అనుసరించారు. అనంతరం ఆయన పార్దివ దేహాన్ని కంఠీరవ స్టేడియానికి తీసుకెళ్లారు. అక్కడ ఆయన అభిమానులు తనను చివరి చూపు చూడనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పునీత్ అభిమానులు అక్కడికి రానున్నారు. అటు అంత్యక్రియలపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేనప్పటికీ.. ఆదివారం జరుగుతాయని వార్తలు వస్తున్నాయి.

కన్నడ పవర్ స్టార్ గా వెలుగొందుతున్న ఆయన కు ఓ భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య పేరు అశ్విని, పిల్లలు వందన, ధృతి. వీరిలో ఓ అమ్మాయి జర్మనీలో చదువుతుంది. తండ్రి చనిపోయిన విషయం తెలిసి తను వెంటనే ఇండియాకు బయల్దేరింది. ఆమె వచ్చాకే ఆయన అంత్యక్రియలు జరుగుతాయని తెలుస్తోంది. అప్పటి వరకు ఆయన అంత్యక్రియలు జరగవని చెప్తున్నారు. దీన్ని బట్టి తన అంత్యక్రియలు ఆదివారం జరిగే అవకాశం ఉన్నట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడిస్తున్నారు.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *