Breaking News

జయలక్ష్మి కూతురు ప్రస్తుతం కొన్ని వందల కోట్ల ఆస్తికి అధిపతి అని మీకు తెలుసా?

సినిమా పరిశ్రమ అనేది ఓ మాయా ప్రపంచం. ఇక్కడ ఎవరి తలరాత ఎలా మారుతుందో చెప్పడం కష్టం. ఓవర్ నైట్ స్టార్స్ గా మారిన వారు ఉన్నారు.. రాత్రికి రాత్రే అథపాతాళానికి వెళ్లిన వారూ ఉన్నారు. సినిమా పరిశ్రమ అనేది ఓ జూదం లాంటిదే అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఎవరు విజయం సాధిస్తారో? ఎవరు ఓటమి పాలవుతారో? చెప్పడం కష్టం. అలాగే కొంత మంది సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి తక్కువ కాలంలోనే మంచి స్థాయికి ఎదిగితే.. మరికొంత మంది సినిమా రంగంలో రాణించేందుకు ఎన్నో కష్టాలు పడ్డవారూ ఉన్నారు. అయితే సినిమా కష్టాలు తెలిసిన ఓ నటీమణి.. తన కూతురును సినిమా రంగం వైపు చూపుకూడా పడనీయనని చెప్తోంది ఓ సీనియర్ నటి. తన కూతురు బాల నటిగా నటిస్తే చాలు.. హీరోయిన్ గా చేయనుగాక చేయను అని కుండ బద్దలు కొడుతోంది.

తన కూతురును ఇండస్ట్రీలోకి పంపేది లేదంటున్న ఆ నటీమణి ఎవరో కాదు.. సీనియర్ నటి జయలక్ష్మి. ఒకప్పుడు ఈమె తెలుగు సినిమా పరిశ్రమను ఓ ఊపు ఊపింది. అయితే తాను మాత్రం తన బిడ్డను సినిమాల్లో హీరోయిన్ గా చేయనని చెప్తుంది. తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాలో హీరోయిన్ కి చెల్లి గా నటించింది ఈమె కూతురే. ఆమె పేరు యామిని శ్వేత. జయం సినిమా తర్వాత యామిని మళ్లీ ఏ సినిమాలోనూ కనిపించలేదు. ఇక ప్రస్తుతం జయలక్ష్మి కూతురు అమెరికా నుంచి వచ్చి విజయవాడ లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తుంది. పెళ్లి కూడా చేసుకొని కొన్ని వందల కోట్ల ఆస్తిని చక్కగా కాపాడుతుంది.. ప్రస్తుతం తన జీవితాన్ని హ్యాపీగా గడుపుతుంది.

తాను సినిమా పరిశ్రమలో ఎన్నో కష్టాలు అనుభవించినట్లు జయలక్ష్మి వెల్లడించింది. అలాంటి బాధలు తన బిడ్డ పడాల్సిన అవసరం లేదని చెప్పింది. అందుకే తనను సినిమాల వైపు చూడకుండా విదేశాలకు పంపినట్లు వెల్లడించింది. కేవలం తనను బాలనటిగా చూడాలి అనుకున్నట్లు చెప్పింది. అందుకే తన కూతురును జయం సినిమాలో చేసేలా అవకాశం ఇచ్చినట్లు చెప్పింది. ప్రస్తుతం తన కూతురు పెళ్లి చేసుకుని విదేశాల్లో హాయిగా జీవిస్తున్నట్లు చెప్పింది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *