Breaking News

జబర్దస్త్ నుంచి సుధీర్ ఔట్.. పాపం అంత బాధను అనుభవించాడా ?

సుడిగాలి సుధీర్. బుల్లితెరపై ఫలు షోలు చేస్తూ ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. జబర్దస్త్ కామెడీ ప్రోగ్రాంతో పస్త్ పాపులారిటీ తెచ్చుకున్నాడు. జబర్దస్త్ మూలంగా ఎంతో మంది కమెడియన్లకు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిలో మంచి పేరు తెచ్చుకున్న కమెడియన్ సుధీర్. తన ఫర్ఫెక్ట్ టైమింగ్ తో పటాసుల్లా పేలే పంచులతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నడు. జబర్దస్త్ షోలో మంచి క్రేజ్ ఉన్న టీమ్ లలో సుడిగాలి సుధీర్ టీమ్ కూడా ఉంది. వీరి టీమ్ జనాలను నవ్వుల్లో ముంచడంలో ముందుంటుందని చెప్పుకోవచ్చు.

కాసేపు వీరి కామెడీ గురించి పక్కన పెడితే.. జబర్దస్త్ వేదికపై యాంకర్ బుల్లితెర జోడీల్లో ర‌ష్మికి, సుధీర్‌కు మాంచి క్రేజ్ ఉంది. వీరి మధ్య సీన్లు జనాలను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. వీరిద్దరి ప్రేమాయణం, రొమాన్స్, పాటలు, డ్యాన్సులు ఒకటేమిటి వీరు బుల్లితెరపై చేసే సందడి అంతా ఇంతా కాదు. వీరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చూసి.. జనాలు ఏదేదో ఊహించుకుంటున్నారు. వారు ప్రేమలో ఉన్నారని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని మాట్లాడుకుంటున్నారు. అవన్నీ అవాస్తవాలని రష్మీ, సుధీర్ చాలా సార్లు చెప్పారు. అది జస్ట్ జనాలను ఎంటర్ టైన్ చేయడానికే అని కూడా వెల్లడించారు. కానీ జనాలు అబ్బే అంటూనే ఉన్నారు. తాజాగా వీరిద్దరు కలిసి ఈటీవీలో జబర్దస్త్ తో పాటు ఢీ షోలోను సందడి బాగా చేస్తున్నారు.

తాజాగా సుధీర్ కు సంబంధించి ఓ వార్త హల్ చల్ చేస్తుంది. ఇంతకీ అదేంటంటే.. ఆయన జబర్దస్త్ షో నుంచి వెళ్లిపోతున్నాడట. అదేంటి టాప్ కామెడీ షో నుంచి తను వెళ్లిపోవడం ఏంటి అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇది వాస్తవం అని తెలుస్తోంది. దానికి కారణం.. ఆయన బుల్లితెర నుంచి వెండితెరకు వెళ్తున్నాడు. ఇప్పటికే పలు సినిమాలు చేసిన ఆయన.. మరికొన్ని సినిమాలకు కూడా ఒప్పుకున్నాడట. అక్కడా.. ఇక్కడా మేనేజ్ చేయడం కుదరడం లేదట. అందుకే కొన్ని రోజులు ఈ షోకు రాకుండా సినిమాలు కంప్లీట్ చేస్తానని.. ఆ తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇస్తానని చెప్పాడట. అయితే అందుకు మల్లెమాల యాజమాన్యం ఒప్పుకోలేదట. దీంతో ఆయన ఈ షో నుంచి బయటకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాడట.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *