Breaking News

జబర్దస్త్ టీం లీడర్ పై దాడి.. చేయి చేసుకున్న సినీ నటుడు.. న్యూస్ బయటకు రాకుండా చేశారా?

తెలుగు టీవీ పరిశ్రమలో సంచలనం రేపిన షో.. జబర్దస్త్. ఈటీవీలో ప్రసారం అయ్యే ఈ షో ఓ రేంజిలో పేలింది. పలువురు కమెడియన్లు చేసే స్కిట్లు జనాలను కడుపుబ్బా నవ్వించాయి. ఫలింతంగా ఆయా టీవీల్లో ఎన్నో కామెడీ షోలో వచ్చినా.. జబర్దస్త్ ను మించి మరేది హిట్ కాలేదని చెప్పుకోవచ్చు. ప్రతి తెలుగింటి లోగిలిలో జబర్దస్త్ మార్మోగుతూ.. ఏండ్ల తరబడి జనాలను నవ్వుల్లో ముంచెత్తుతోంది. షో ఎలా ఉన్నా.. షోలో కమెడియన్లు చేసే స్కిట్లు మాత్రం అప్పుడప్పుడు తీవ్ర వివాదాలకు కేంద్ర బిందువులుగా మారుగుతున్నాయి. ఇప్పటికి చాలా సార్లు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంది జబర్దస్త్ షో. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి జరిగినట్లు తెలుస్తోంది. ఇంతకీ తాజాగా వివాదం ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

గతంలో ఓసారి గౌడ కులస్తులను కించ పరిచేలా ఓ టీం లీడర్ స్కిట్ చేశాడని ఓ రేంజిలో విమర్శలు వచ్చాయి. అదే సమయంలో కొందరు ఆ కులానికి చెందిన వ్యక్తులు ఆ కమెడియన్ పై దాడి చేసి చితకబాదారు. అప్పట్లో ఈ ఘటన సంచలనం అయ్యింది. పబ్లిగ్గానే అతడిపై దాడి జరగడంతో అందరూ ఆశ్చర్యపోయారు. తాజాగా మరో టీం లీడర్ మీద కూడా దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ నటుడు మాట్లాడిన మాటలపై జబర్దస్త్ టీం లీడర్ ట్రోల్ చేశాడు. ఆయన డైలాగులు తీసుకుని స్కిట్ చేశాడు. ఈ విషయం సదరు నటుడికి తెలిసిందట. వెంటనే ఫోన్ చేశాడట. బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడట. కానీ సదరు టీం లీడర్ నో చెప్పడంతో సెట్ కు వెళ్లి గొడవ చేశాడట.

అదే సమయంలో అక్కడ వాడీ వేడి మాటలు వచ్చాయట. ఈ నేపథ్యంలో సదరు నటుడు జబర్దస్త్ టీం లీడర్ మీద చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారట. ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియదు కానీ.. సినీ సర్కిల్స్ లో మాత్రం జోరుగా చర్చ నడుస్తుంది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *