Breaking News

ఛార్మి మొదటి ముద్దు అతడికే పెట్టిందట.. ఏ వయసులో తెలుసా ?

ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక మధుర సంఘట ఉంటుంది. కొంత మందికి ఎక్కువ కూడా ఉండవచ్చు. అయితే ఆయా విషయాలను కొందరు బయటకు చెప్తుంటారు. మరికొందరు బయటకు చెప్పలేరు. అయితే సినిమా తారలు మాత్రం చాలా వరకు తమ జీవితంలోని ఇష్టమైన, కష్టమైన విషయాలను అప్పుడప్పుడూ బయటకు చెప్తూనే ఉంటారు. తాజాగా అలాంటి విషయాల గురించే చెప్పింది బరువైన అందాల భామ ఛార్మీ. ఇంతకీ తను చెప్పిన విషయాలేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

హీరోయిన్ గా ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ.. తన ఫస్ట్ లవ్ గురించి, తన తొలి ముద్దు గురించి బయట పెట్టింది. తెలుగు సినిమా పరిశ్రమలో గ్లామర్ డాల్ గా జనాల మదిలో నిలిచిపోయింది ఈ బుంగమూతి భామ. అతి తక్కువ కాలంలోనే తెలుగులోని టాప్ హీరోలతో జోడీ కట్టింది. చిన్న వయసులో అంటే 2001లో నీ తోడు కావాలి అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత వచ్చిన శ్రీఆంజనేయం సినిమా మాత్రం తనకు మంచి పేరు తెచ్చింది. ఈ విజయంతో వరుస సినిమాలు చేసింది. మాస్, చక్రం, పౌర్ణమి, జ్యోతిలక్ష్మి సహా పలు సక్సెస్ ఫుల్ సినిమాలు చేసింది. మంత్ర సినిమాలతో తను ఎద అందాలతో జనాలను ఫిదా చేసింది.

ఈ ముద్దుగుమ్మ తన వ్యక్తిగత జీవితానికి చెందిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. తను ఫస్ట్ లవ్ లెటర్ ఎవరికి రాసింది.. తను ఫస్ట్ ముద్దు ఎవరికి పెట్టింది చెప్పింది. తను స్కూల్లో చదువుకునే రోజుల్లోనే ప్రేమలో పడినట్లు చెప్పింది. పంజాబీ అమ్మాయి అయిన తాను.. మరో పంజాబీ అబ్బాయిని ప్రేమించినట్లు చెప్పింది. అయితే తనది వన్ సైడ్ లవ్ అని చెప్పింది. అతడిని ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నించినా.. తను పడలేదని చెప్పింది. ఓరోజు లవ్ లెటర్ రాసినా తను పట్టించుకోలేదని వెల్లడించింది. అటు తొలి ముద్దు తన పేరెంట్స్ తోనేనని చెప్పింది.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *