Breaking News

చై-సామ్ చెప్పినవన్నీ అబద్దాలేనా.. ? ఆ ఇంటర్వ్యూ లో సమంత భర్త గురించి ఇలా చెప్పిందేంటి ?

దాదాపుగా రెండు నెలల నుంచి నుంచి అక్కినేని నాగచైతన్య, సమంత డైవోర్స్ విషయమై నెట్టింట వార్తలు హల్‌చల్ చేశాయి. ఎట్టకేలకు ఇందుకు సంబంధించిన వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. తాము విడాకులు తీసుకుంటున్నట్లు అక్కినేని నాగచైతన్య, సమంత ఇద్దరు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా తెలిపారు. ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఇందుకు సంబంధించి పోస్టులు పెట్టారు.

ఇకపోతే నాగచైతన్య-సమంత వైవాహిక బంధం నుంచి విడిపోయినప్పటికీ ఫ్రెండ్స్‌గా కలిసి ఉంటామని చెప్పకనే చెప్పారు. అయితే, సమంత నాగచైతన్య నుంచి విడిపోవడానికి కారణాలేంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో చైతన్య-సామ్ కలిసిన మాట్లాడిన సంగతుల గురించి చర్చ జరుగుతున్నది. నాగచైతన్య-సమంత కలిసి నటించగా సూపర్ హిట్ అయిన మూవీ ‘మజిలీ’ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ నాగచైతన్య టూ పర్ఫెక్ట్‌గా ఉంటాడని, అది తనకు నచ్చదని పేర్కొంది.

ఈ నేపథ్యంలో ఈ విషయమై సమంత బాగా ఇబ్బంది పడి ఉండొచ్చని తెలుస్తోంది. ప్రతీ విషయంలో నాగచైతన్య పర్ఫెక్ట్‌గా ఉండటం వల్ల సమంత కూడా పర్ఫెక్ట్‌గా ఉండాల్సి వచ్చిందని, అలా వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని కొందరు అంటున్నారు. అదే ఇంటర్వ్యూలో సమంత విషయమై చైతన్య మాట్లాడుతూ సోషల్ మీడియా తనను చాలా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుందని, అది తనకు నచ్చదని తెలిపాడు. సమంతలో ఉన్న ఎనర్జీ తనకు చాలా ఇష్టమని చైతన్య చెప్పాడు. మొత్తంగా మాత్రం ‘మజిలీ’ సినిమా ఇంటర్వ్యూ సందర్భంగా చైతన్య-సమంత మాట్లాడిన మాటలు అన్ని ఉట్టి మాటలేనని ఇప్పుడు తాజాగా విడాకులు ప్రకటనతో తేలిపోయినట్లయిందని నెటిజన్లు అనుకుంటున్నారు. ‘మజిలీ’ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాము ఇద్దరం జీవితంలో తీసుకున్న అతి గొప్ప నిర్ణయం మ్యారేజ్ చేసుకోవడమే అని చెప్పారు. అలా పదేళ్లు హాయిగా గడిపిన సమంత-చైతన్య తాజాగా వారి వివాహ బంధానికి వీడ్కోలు పలికారు. టాలీవుడ్ బ్యూటిఫుల్ అండ్ ఇన్‌స్పైరింగ్ కపుల్‌గా నాగచైతన్య-సమంత ఉండాలని చాలా మంది కోరుకున్నారు. కానీ, అది నెరవేరలేదు. అయితే, నాగచైతన్య-సమంత ఇద్దరు కూడా తమ ఓన్ వేస్‌లో ముందుకు సాగాలని పలువురు కోరుకుంటున్నారు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *