Breaking News

చైతును వ‌దిలేసినా స‌మంత‌తో ఆ రిలేష‌న్ ఉందంటోన్న అఖిల్‌…!

టాలీవుడ్‌లో ఇప్పుడు అక్కినేని నాగ‌చైత‌న్య – స‌మంత విడాకుల వ్య‌వ‌హారం ఒక్క‌టే హాట్ టాపిక్‌గా మారింది. ప‌దేళ్ల స్నేహం, నాలుగేళ్ల వైవాహిక బంధానికి వీరు ఫుల్‌స్టాప్ పెట్టేస్తార‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. నెల రోజులుగా వ‌స్తోన్న వార్త‌లకు చైతు – స‌మంత బ‌య‌ట‌కు వ‌చ్చి అవి పుకార్లే అని తేల్చి చెపుతార‌నే అంద‌రూ ఆశ‌తో ఎదురు చూశారు. అయితే వీరిద్ద‌రు స‌డెన్‌గా ఒకేసారి త‌మ సోష‌ల్ మీడియా వేదిక‌గా తాము విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డంతో చాలా మంది జీర్ణించుకోలేక‌పోతున్నారు.

ఇదిలా ఉంటే స‌మంత‌కు అక్కినేని ఫ్యామిలీతో ఎవ‌రికితో ఎక్క‌డ ? ఎందుకు చెడిందో గాని.. ఆమె ఆ ఇంటి కోడ‌లిగా ఉన్న‌న్ని రోజులు మాత్రం ఫ్యామిలీ లైఫ్‌ను చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇటు భ‌ర్త‌గా చైతును ఆమె ప్రేమిస్తూనే ఉండేది. అమ‌ల గురించి స‌మంత ఎక్కువుగా ప్ర‌స్తావించ‌క‌పోయినా నాగార్జున‌ను కూడా ప‌దే ప‌దే మామ అంటూ ఆట‌ప‌ట్టిస్తూ ఉండేది. ఎన్నోసార్లు వేదిక‌ల మీద‌, సినిమా ఫంక్ష‌న్ల‌లోనూ నాగ్ సామ్‌ను ఆట ప‌ట్టించ‌డం చూశాం.

ఇక మరిది అఖిల్‌తోనూ ఆమె ఎంతో క్లోజ్‌గా ఉండేది. వాస్త‌వానికి స‌మంత – చైతు కంటే అఖిల్ పెళ్లే ముందు ఫిక్స్ చేశాడు నాగార్జున శ్రియా భూపాల్ రెడ్డితో అఖిల్‌కు ఎంగేజ్‌మెంట్ కూడా అయ్యింది. ఇట‌లీలో వీరి పెళ్లికి ఏర్పాట్లు చేశారు. ఈ ఎంగేజ్‌మెంట్‌, ఇత‌ర కార్య‌క్ర‌మాల్లో స‌మంత హ‌డావిడే ఎక్కువుగా కనిపించింది. ప‌లు పార్టీల్లో అఖిల్ – స‌మంత వ‌దిన – మ‌రిదిలా కాకుండా బెస్ట్ ఫ్రెండ్స్‌లా క‌లిసి పోయి ఎంజాయ్ చేసేవారు. ఎన్నోసార్లు అఖిల్ సైతం త‌న వ‌దినను ఆకాశానికి ఎత్తేస్తూ ఉండేవాడు.

అయితే ఇప్పుడు త‌న అన్న‌, వ‌దిన‌లు విడిపోవ‌డం అఖిల్ మ‌న‌స్సును కూడా ఎంతో క‌ష్ట‌పెట్టింది.. అన్న‌కు విడాకులు ఇచ్చేసి అక్కినేని ఫ్యామిలీ కోడ‌లు అన్న పొజిష‌న్‌ను ఆమె వ‌దులుకున్నా.. స‌మంత త‌న‌కు ఎప్ప‌ట‌కీ వ‌దినే అని అఖిల్ స‌న్నిహితుల వ‌ద్ద చెపుతున్నాడ‌ట‌. వారిద్ద‌రు విడిపోవ‌డం త‌న‌కు ఎంతో బాధ‌గా ఉన్నా.. వారి వ్య‌క్తిగ‌త నిర్ణ‌యాల‌ను, ప్రైవ‌సీని ప్ర‌తి ఒక్క‌రు గౌర‌వించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అఖిల్ చెపుతున్నాడు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *