Breaking News

చైతన్యతో సమంత విడాకుల మ్యాటర్ లో మరొక ట్విస్ట్ ! మెగాస్టార్ జోక్యం !

అక్కినేని సమంత, నాగచైతన్య డైవోర్స్ మ్యాటర్ గత కొద్ది రోజుల నుంచి ట్రెండింగ్‌లో ఉంది. ఇంకా కొద్ది రోజుల పాటు అలానే కొనసాగే చాన్సెస్ ఉన్నాయి. విడాకుల విషయమై సమంత పాక్షికంగానే స్పందించారు. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని, ఉంటానని, హైదరాబాద్‌లోనే ఇల్లు ఉందని, హైదరాబాద్ అంటే చాలా ఇష్టమని పేర్కొంది. కానీ, విడాకులు విషయమై అస్సలు స్పందించలేదు. దాంతో అక్టోబర్ 7న చైతు-సమంత పెళ్లి రోజున విడాకుల విషయమై క్లారిటీ వస్తుందని నెటిజన్లు, అక్కినేని వారి అభిమానులు సోషల్ మీడియా వేదికగా అనుకుంటున్నారు. ఈ సంగతులు ఇలా ఉంచితే చై-సామ్ డైవోర్స్ మ్యాటర్ మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లిందట.

నాగచైతన్య నటించిన ‘లవ్ స్టోరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ క్రమంలో మెగాస్టార్ దృష్టికి ఈ విషయం వెళ్లినట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. అక్కినేని కుటుంబానికి సన్నిహితుడిగా ఉన్న చిరంజీవి.. నాగచైతన్య, సమంత మధ్య ఉన్న గ్యాప్ గురించి తెలుసుకుని, వాటిని సార్ట్ ఔట్ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. సామ్-చై అస్సలు విడిపోకూడదు అని సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్‌ చేస్తున్నారు. అయితే, డైవోర్స్ మ్యాటర్ గురించి తాజాగా మరో ట్విస్ట్ బయటకు వచ్చింది. డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ డైరెక్షన్‌లో నాగచైతన్య, సమంత వెబ్ సిరీస్ చేయబోతున్నారట. ఈ క్రమంలోనే ఆ వెబ్ సిరీస్ పబ్లిసిటీ కోసం ఇలా వీళ్లు డైవోర్స్ మ్యాటర్ స్పందించడం లేదని, వెబ్ సిరీస్ డైవోర్స్ కథాంశంగా తెరకెక్కుతోందనే వార్త నెట్టింట హల్ చల్ అవుతుంది. కాగా, ఈ విషయం తెలుసుకుని అక్కినేని వారి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిసిటీ కోసం విడాకులు విషయం ట్రెండ్ చేస్తున్నారని అనుకుంటున్నారు. అయితే, డైవోర్స్ మ్యాటర్‌పై ఫుల్ క్లారిటీ అక్టోబర్ 7న వస్తుందని మరొకొందరు సోషల్ మీడియా వేదికగా చెప్తున్నారు. నాగచైతన్య ప్రస్తుతం ‘లవ్ స్టోరి’ ఫిల్మ్ సక్సెస్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా స్లో పాయిజన్‌లాగా పాజిటివ్ టాక్ తెచ్చుకుని మెల్ల మెల్లగా హిట్ దిశగా కొనసాగుతోంది.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *