Breaking News

చిరంజీవిని నమ్ముకుని ఎంతో నష్టపోయామంటున్న అభిమానులు.. ఎలాగంటే!

తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ ఎంత చెబితే అంత.. ఈ విషయం ఎవరిని అడిగినా చెబుతారు. ఆయన రికమండేషన్‌తో వెళితే తప్పకుండా పని జరగాల్సిందే. కాలేదు అనే సమస్యే ఉండదు. అది ఇప్పుడు. ఒకప్పుడు సాధారణ వ్యక్తి.. ఇప్పుడు అచంచల శక్తి. అంతటి స్థాయికి చిరంజీవి ఎవరి సపోర్టు లేకుండా ఎదిగాడంటే దాని వెనుక ఎంతో కృషి, పట్టుదల, సినిమాల మీద ఆయనకు ఉన్న పిచ్చే కారణమని ఎంతో మంది గొప్ప గొప్ప డైరెక్టర్లు, సినీ నటులే స్వయంగా తెలిపారు. అంతేకాకుండా చిరులో దయాగుణం ఎక్కువ. అడిగిన వారికి లేదనకుండా సహాయం చేస్తుంటాడు అని సినీ వర్గాల టాక్. ఆయన వలన ఎంతమంది లాభపడ్డారో లెక్కపెట్టలేం కానీ, ఆయన వల్ల నష్టపోయిన వారు కూడా ఉన్నారట. అందుకు కారణం చిరంజీవి రాజకీయాల్లోకి రావడమే అని తెలుస్తోంది.

2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అవుతారని చాలా మంది బలంగా నమ్మారు అభిమానులు. NTR లాగా చిరు కొత్త చరిత్ర సృష్టిస్తాడు అనుకున్నారు. కానీ అంచనాలు తలకిందులాయ్యాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన మంచి పనులు ఆయన్ను మళ్లీ తిరిగి ముఖ్యమంత్రిని చేశాయి. చిరు మాత్రం కొన్ని స్థానాలతో సరిపెట్టుకున్నాడు. అయితే, చిరు ముఖ్యమంత్రి అవుతాడని కొంతమంది అభిమానులు ఆనాడు బెట్ వేశారు. ఆయన్ను విమర్శించే వారు కూడా చిరంజీవి ఓడిపోతాడని ఏకంగా రూ. 20 కోట్లు బెట్ వేసినట్టు పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. అయితే, విమర్శకులు మాత్రం చిరు ఓడిపోవడంతో వారు లాభపడ్డారు. కానీ, ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అవుతాడని బెట్ వేసిన అభిమానలు మాత్రం దారుణంగా నష్టపోయారట. ఈ విషయం తెలుసుకున్న చిరు నష్టపోయిన వారిలో కొందరిని ఆర్థికంగా ఆదుకున్నట్టు తెలిసింది.

ఇక ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల దృష్ట్యా ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఆయన కేంద్రమంత్రిగా ప్రమాణం చేశారు. రాజకీయాల్లో బిజీగా ఉన్న సమయంలో చిరు మంచి మంచి సినిమా ఆఫర్లను కూడా వదులుకున్నాడు. అయితే, ఆయనకు రాజకీయాలు కలిసిరాకపోవడంతో అభిమానుల కోరిక మేరకు మళ్లీ సినిమాలు చేస్తున్నాడు. నాటి నుంచి చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కాగా, ఇక తాను రాజకీయాల వైపు చూడబోనని, సినీ పరిశ్రమలో ఉంటూనే ప్రజలకు తన వంతు సహాయం చేస్తానని సన్నిహితులతో చెప్పినట్టు టాక్.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *