Breaking News

చిన్నప్పుడు కూతురు.. పెద్దయ్యాక హీరోయిన్.. రాజశేఖర్ తో నటించిన ఆ నటీమణి ఎవరో తెలుసా?

తెలుగు సినిమా పరిశ్రమలో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో రాజశేఖర్. దశాబ్దాలుగా ఆయన తెలుగు సినీ జనాలను అలరిస్తూనే ఉన్నాడు. స్వతహాగా డాక్టర్ అయిన రాజశేఖర్.. ఆ తర్వాత యాక్టర్ గా మారి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఎలాంటి సినిమా అయినా.. తన మార్క్ నటనతో వారెవ్వా అనిపించాడు రాజశేఖర్. ప్రముఖ దర్శకుడు భారతీ రాజా దర్శకత్వంలో 1984లో వచ్చిన తమిళ సినిమా పుదుమై పెన్ సినిమాతో ఆయన కెరీర్ మొదలయ్యింది. తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తన కెరీర్ తొలినాళ్లలో తన కూతురు పాత్ర పోషించిన ఓ అమ్మాయి ఆ తర్వాత తనతో పాటు హీరోయిన్ గా నటించింది. ఇంతకీ ఆ నటీమణి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

1985లో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు రాజశేఖర్. వందేమాతరం మూవీతో తెలుగు జనాలకు తన నటనను చూపించాడు. ఆ తర్వాత వరుసగా పలు సినిమాలు చేశాడు. ఈ ప్రశ్నకు బదులేది, దొర బిడ్డ, చల్లని రామయ్య చక్కని సీతమ్మ, తలంబ్రాలు, రేపటి పౌరులు, అరుణకిరణం, కాష్మోరా సహా పలు సినిమాలు చేశాడు. వీటిలో కొన్ని సినిమాలు అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోయినా.. నటుడిగా మాత్రం ఆయన విజయవంతం అయ్యాడు. తాజాగా 2017లో మరోసారి సత్తా చాటాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన గరుడ వేగ సినిమాతో మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించాడు. 2019లో వచ్చిన కల్కీ సినిమా తర్వాత మళ్లీ తను కనిపించలేదు. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే రాజశేఖర్ తో తన కూతురు క్యారెక్టర్ చేసిన ఓ అమ్మాయి ఆ తర్వాత తనతో హీరోయిన్ గా చేసింది. ఇంతకీ తను ఎవరో కాదు రాశి. 1989లో రాజశేఖర్ సుహాసిని నటీనటులుగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మమతల కోవెల. ఈ సినిమాలో రాజశేఖర్ కూతురుగా రాశీ నటించింది. కొంత కాలం తర్వాత ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన నేటి గాంధీ సినిమాలో రాజశేఖర్ తో కలిసి హీరోయిన్ గా చేసింది.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *