Breaking News

చిక్కిశల్యమై, మారుమూల హాస్పిటల్ లో 800 ల సినిమాల హీరోయిన్ చివరి రోజులు

శ్రీ విద్య. ఎన్నో సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. చక్కటి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లో తను బాగానే కొనసాగినా.. వ్యక్తిగత జీవితంలోనే పలు ఇబ్బందులు ఎదుర్కొంది. ఇంతకీ తను జీవితంలో ఎలాంటి అవస్థలు పడింది అనే విషయాన్ని కుట్టి పద్మిని తాజాగా వివరించింది. ఇంతకీ తను విద్య గురించి ఏం చెప్పిందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. తమిళంలో నెంజిల్ ఒరు ఆలయం అనే సినిమా ఆడిషన్ కోసం తాను వెళ్లినట్లు పద్మిని చెప్పింది. అదే ఆడిషన్ కు ప్రముఖ గాయని ఎం.ఎల్.వసంత కుమారి కూతురును తీసుకొచ్చింది. దర్శకుడు శ్రీధర్ ఆడిషన్ చేశాడు. చివరకు తనను కాదని పద్మిని సెలెక్ట్ చేశాడు దర్శకుడు.

సినిమా రంగంలో సావిత్ర పోలికలు కనిపించే నటీమణుల్లో ఒకరు సరిత కాగా మరొకరు శ్రీవిద్య అని చెప్పింది పద్మిని. విద్యతో చిన్నప్పటి నుంచి స్నేహంగా ఉండేదని చెప్పింది. హీరోయిన్ అయ్యాక విద్య.. కమల్ హాసన్ మీద ప్రేమ పెంచుకుంది. ఓసారి తను ఈ విషయం చెప్పిందని.. అయితే మోసపోవద్దని సలహా ఇచ్చినట్లు చెప్పింది. కానీ ఆమె తన ప్రేమను చంపుకోలేదు. కమల్ హాసన్ తొలి పెళ్లి జరిగినప్పుడు శ్రీవిద్య చాలా బాధపడినట్లు చెప్పింది. ఆ తర్వాత తను జార్జ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించింది. అయితే పిల్లలు లేకపోవడంతో తను డిప్రెషన్ కు గురైనట్లు చెప్పింది. అంతేకాదు.. కొద్ది కాలానికే ఈ జంట విడిపోయినట్లు చెప్పింది. చాలా కాలం తను ఎక్కడుందో తెలియదు. ఓసారి తాను చేసే సీరియల్ లో ఆమెకు ఓ క్యారెక్టర్ ఇవ్వాలనుకున్నట్లు చెప్పింది. కష్టపడి ఆమె ఫోన్ నెంబర్ కనుక్కున్నట్లు చెప్పింది.

తనకు ఫోన్ చేసి విషయం చెప్తే తాను కేరళలో ఉన్నట్లు చెప్పింది. వచ్చి తనను కలవాలని విద్య వెల్లడించింది. అయితే తను చెప్పిన అడ్రస్ కు వెళ్తే అక్కడ ఓ హాస్పిటల్ ఉంది. లోపలికి వెళ్లి చూస్తే తను చాలా సన్నగా అయ్యింది. నన్ను పక్కనే కూర్చోబెట్టుకుని ఏంటి నీ సీరియల్ అని అడిగింది. నేను చెప్పాను. ఇంకో వారంలో నేను చనిపోతాను. నాకు క్యాన్సర్ అని షాకింగ్ న్యూస్ చెప్పినట్లు వెల్లడించింది. తాను ఎవరినీ మోసం చేయలేదని.. అంతా తననే మోసం చేశారని.. చివరకు దేవుడికి కూడా తన మీద దయ లేదని చెప్పి ఏడ్చింది శ్రీవిద్య. పద్మిని కూతురు ముద్దుపెట్టుకుని ఓ చాక్లెట్ ఇచ్చింది. సుమారు 800 సినిమాల్లో నటించిన శ్రీవిద్య.. చివరకు అత్యంత విషాదంగా తన జీవితం ముగిసిపోయింది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *