Breaking News

చదివింది ఏమో BTECH కానీ టాలీవుడ్ లో మాత్రం టాప్ స్టార్స్

సినిమా రంగంలో రాణించాలంటే టాలెంట్ ఉండాలని అంటుంటారు. అది నిజమే అయినప్పటికీ కొంత మంది మాత్రం చదువు రాక చిత్రపరిశ్రమలో అడుగుపెట్టామని చెప్తుంటారు. అయితే, సినిమా రంగంలోకి ఎంట్రీ బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఈజీనే. కానీ, ఇక్కడ నిలదొక్కుకోవడమే అతి కష్టమైన పని. ఈ సంగతులు పక్కనబెడితే.. కొంత మంది సినీ నటులు బాగా చదువుకున్న వారూ సినీ పరిశ్రమలో ఉన్నారు. ఆ కోవకు చెందిన టాలీవుడ్ యాక్టర్స్ వీరే..

బీటెక్ చదివి సినీ పరిశ్రమలో అడుగు పెట్టి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని సినిమా పరిశ్రమలో కొనసాగుతున్నారు ఈ సినీ నటులు. ఇందులో దర్శకులు, నటులు ఉన్నారు. అక్కినేని నాగేశ్వరరావు తనయుడు నాగార్జున చెన్నైలో ఇంజినీరింగ్ పూర్తి చేయడంతో పాటు అగ్రరాజ్యం అమెరికాలో ఆటోమొబైల్స్‌లో మాస్టర్స్ కూడా చేశాడు.
కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా బీటెక్ గ్రాడ్యుయేటే. అగ్రరాజ్యం అమెరికాలోని ఫెర్రిస్ స్టేట్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచ్‌లర్ డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం వెన్నెల కిషోర్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా జాబ్ కూడా చేశాడు. యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రితూ వర్మ హైదరాబాద్‌లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్‌లో బీటెక్ పూర్తి చేసింది. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల హైదరాబాద్‌లోని సీబీఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన అనంతరం మాస్టర్స్ కూడా చేశాడు. ఆ తర్వాత కాలంలో శేఖర్ తాను చదువుకున్న సీబీఐటీ కాలేజ్ ప్రాంగణంలోనే ‘హ్యాపీడేస్’ సినిమా తీశాడు. యాక్టర్ అండ్ డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ అమెరికాలోని నార్త్ డకోటా యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేశాడు. అనంతరం కొన్నాళ్లు ఉద్యోగం కూడా చేశాడు. బ్యూటిఫుల్ హీరోయిన్ తాప్సీ న్యూఢిల్లీలోని గురు తేగ్ బహదూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ‌లో కంపూటర్స్ సైన్స్ గ్రూపులో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బీటెక్ గ్రాడ్యుయేటే కాగా, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజ్‌లో సివిల్ ఇంజినీరింగ్ చదివాడు.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *