Breaking News

చంచల్ గూడ జైల్లో వైస్ జగన్ తోనే ఉన్నా.. డార్క్ రూంలో నన్న న*గా నిలబెట్టారన్న టీవీ నటుడు

కృష్ణ కౌశిక్.. బుల్లితెరపై ఎంతో క్రేజున్న నటుడు. ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా జరిగిన మా ఎన్నికల్లో ఈసీ మెంబర్ గా విజయం సాధించాడు. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి బరిలోకి దిగి విజయం సాధించాడు. ఆ తర్వాత తన పదవికి రాజీనామా చేసి హాట్ టాపిక్ గా నిలిచాడు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే ఆయన.. దాని మూలంగానే పలు సమస్యలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు సీరియల్స్ లో నటించడం చాలా తక్కువ చేసిన ఆయన ఒకప్పుడు మాత్రం మంచి సీరియల్స్ లో నటించాడు.

ఒకానొక సమయంలో టీవీ నటులు సమస్యలపై ఆయన పోరాటం చేశాడు. అందులో భాగంగానే తను జైలుకు వెళ్లాడు. అదే సమయంలో ప్రస్తుత ఏపీ సీఎం జగన్ కూడా చంచల్ గూడ జైల్లోనే ఉన్నాడు. ఆ సందర్భంలో తనకు ఎదురైన అనుభవాల గురించి చెప్పాడు. జైలు జీవితం తన జీవితంలో మర్చిపోలేని ఘట్టం అని చెప్పాడు. దాని మూలంగా అమెరికాకు వెళ్లే అవకాశాన్ని కోల్పోయినట్లు చెప్పాడు. తన లైఫ్ లో ఏనాడు జైలుకు వెళ్తానని ఊహించలేదని చెప్పాడు. అప్పట్లో తనకు సమీపంలోనే జగన్ ఉండేవాడని చెప్పాడు. అయితే తనను మాత్రం చూడలేదన్నాడు. ఆయనతో పాటు నిమ్మగడ్డ ప్రసాద్ ఉండేవాడని చెప్పాడు. అయితే తన బ్లాకులో 80 మంది ఖైదీలు ఉన్నట్లు కౌశిక్ చెప్పాడు.

తాను జైల్లోకి అడుగు పెట్టగానే రిజిస్టర్ లో సంతకం పెట్టించుకుంటారని చెప్పాడు. ఆ తర్వాత లోపలికి తీసుకెళ్లి బట్టలు ఇప్పించేవారని చెప్పాడు. ఒంటిపై మొలతాడు సహా ఏ తాడులున్న తీసివేసే వారని చెప్పాడు. డార్క్ రూంలో బట్టలు లేకుండా నిలబెట్టి అన్ని చెక్ చేశారని చెప్పాడు. అయితే తనను ఓ కానిస్టేబుల్ గుర్తుపట్టి.. డ్రాయర్ వేసుకోమని చెప్పినట్లు వెల్లడించాడు. కళాకారుడిగా తనకు వచ్చిన గుర్తింపు మూలంగా తనకు ఆ గౌరవం దక్కిందన్నాడు. అందుకే తాను నటుడిని అని చెప్పుకోవడానికి చాలా సంతోషం పడతానని చెప్పాడు. జైల్లో చైను బకెట్లో చాయ్ పోసేవారని.. వెళ్లి ముంచుకుని తాగడమే అన్నాడు. జైల్లో తనకు కేటాయించిన గ్లాస్, దుప్పటి ఎదరో కొట్టేశారని చెప్పాడు. తాను జైలుకు వెళ్లిన తొలిరోజు బాత్రూంకు, తిండికి చాలా ఇబ్బంది పడినట్లు చెప్పాడు. మిగతా ఖైదీలతో పోల్చితే తనను జైలర్ చాలా గౌరవంగా చూసుకున్నాడని చెప్పాడు. ఒక్కరోజు జైలుకు వెళ్లడం మూలంగా తను రెండు సార్లు అమెరికాకు వెళ్లి అవకాశాన్ని మిస్ చేసుకున్నట్లు వెల్లడించాడు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *