Breaking News

గొప్పలకు పోయి ఉన్న కాస్త పరువు పోగొట్టుకున్న సెలబ్స్ వీళ్ళే !

తెలుగు సినిమా పరిశ్రమలో నటీనటుల కంటే దర్శకులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అయితే ఆయా దర్శకులు పలు సినిమాలను భారీ అంచనాలతో తెరక్కించి.. సూపర్ డూపర్ హిట్ అవుతాయని భావించారు. అంతేకాదు.. భారీగా ఆడియో ఫంక్షన్లు.. ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించి.. హీరోలు, హీరోయిన్లు, దర్శక, నిర్మాతలు సినిమా సూపర్ హిట్టు, బంఫర్ హిట్టు, కనీ వినీ ఎరుగని హిట్టు అంటూ ఎన్నో కొతలు కోశారు. అయితే చివరకు సినిమా విడుదలై.. అట్లర్ ఫ్లాప్ అయిన సందర్భాలున్నాయి. దర్శకులు అంతకు ముందు చేసిన కామెంట్ల పట్ల సిగ్గు పడ్డారు. ఒక్కమాటలో చెప్పాలంటే సిగ్గుతో చచ్చిపోయారు. అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న దర్శకులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

మెహర్ రమేష్
మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన సినిమా శక్తి. జూనియర్ హీరోగా నటించిన ఈ సినిమా గురించి అప్పట్లో ఆయన ఓ రేంజిలో స్పీచ్ దంచాడు. ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో బ్లాక్ బస్టర్ కనఫార్మ్ అన్నాడు. కానీ సినిమా విడుదల అయ్యాక డిజాస్టర్ అయ్యింది. పరువు అడ్డంగా పోయింది.

త్రివిక్రమ్
దర్శకుడు త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో అజ్ఞాతవాసి సినిమా వచ్చింది. ఈ సినిమా వేడుకలో దర్శకుడు త్రివిక్రమ్ ఓ రేంజిలో స్పీచ్ ఇచ్చాడు. పవన్ కల్యాణ్ ఇందులో తన నట విశ్వరూపం చూపిస్తాడు అని చెప్పాడు. కానీ సినిమా డిజాస్టర్ అయ్యింది. త్రివిక్రమ్ పరువు పోయింది.

బోయపాటి శ్రీను
ఈయన కూడా వినయ విధేయ రామ సినిమా విషయంలో అదిరిపోయే డైలాగులు చెప్పాడు. గుండో మీద చెయ్యేసుకుని సినిమాకు రావాలంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. బోయపాటి మాటలు ఉత్త ముచ్చట్లేనని తేలిపోయింది. ఈ సినిమాతో మూలంగా దర్శకుడు బోయపాటి పరువు కూడా గంగలో కలిసింది. ఈ నేపథ్యంలోనే పలువురు దర్శకులు ప్రస్తుతం కాస్త తగ్గి మాట్లాడుతున్నారు. అడ్డుగోలుగా మాట్లాడే మాటలకు కాస్త అడ్డుకట్ట వేస్తున్నారు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *