Breaking News

క‌డుపు చేసి వ‌దిలేశారు.. ఆ అమ్మాయికి న్యాయం చెయ్యి ప‌వ‌న్ః పోసాని

పోసాని కృష్ణ‌ముర‌ళి మాట్లాడితే మాట‌లు తూటాల్లా త‌గులుతుంటాయి. ఆయ‌న ముక్కుసూటిగా మాట్లాడుతుంటారు. ఇక సినిమాల ప‌రంగానే కాకుండా రాజ‌కీయంగా కూడా ఆయ‌న కొంద‌రిని టార్గెట్ చేస్తున్న‌ట్టే మాట్లాడుతారు. ఇక జ‌గ‌న్‌ను ఎవ‌ర‌నా ఏదైనా అంటే వెంట‌నే విరుచుకుప‌డుతారు. మ‌రీ ముఖ్యంగా సినిమా ఇండ‌స్ట్రీలో ఎవ‌రైనా వైసీపిని విమ‌ర్శిస్తే వెంట‌నే పోసాని రంగంలోకి దిగిపోతారు. వారిని త‌న మాట‌ల‌తో చీల్చి చెండాడుతాడు ఈ న‌టుడు. ఇక ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ను టార్గెట్ చేసేసాడు.

మొన్న రిప‌బ్లిక్ మూవీ ఆడియో ఫంక్ష‌న్ లో ప‌వ‌న్ వైసీపీని టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పించిన విష‌యం తెలిసిందే. దీంతో పోసాని భ‌గ్గుమ‌న్నాడు. వెంట‌నే ప్రెస్ మీట్ పెట్టేసి చెడామ‌డా ప‌వ‌న్‌పై నిప్పులు చెరిగాడు పోసాని. జ‌గ‌న్ ప్రభుత్వాన్నే విమర్శిస్తావా ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. నువ్వు చెప్పేదేంటి అని ఊగిపోయాడు. ఇక ప‌వ‌న్‌కు ఓ సంచ‌ల‌న స‌వాల్ కూడా విసిరాడు. నీకు నింజ‌గానే నిజాయితీ ఉంటే టాలీవుడ్ లో పంజాబీ అమ్మాయిపై జ‌రిగిన దారుణాన్ని ప్ర‌శ్నించొచ్చు గ‌దా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఒక హీరోగా నీకు బాధ్య‌త లేదా అంటూ ప్ర‌వ్నించారు పోసాని,

టాలీవుడ్‌లోకి ఓ పంజాబీ అమ్మాయి అవ‌కాశాల కోసం వచ్చింద‌ని, కానీ ఓ వ్య‌క్తి ఆమె ప‌రిస్థితిని అవ‌కాశంగా మ‌లుచుకుని ఆమెను చేరదీసి మోసం చేశాడ‌ని చెప్పాడు. ఇక ఆ వ్య‌క్తి పంజాబీ అమ్మాయికి కడుపు చేసి వదిలేసాడంటూ వివ‌రించాడు. ఆ విష‌యం బ‌య‌ట‌కు చెప్ప‌కుండా నోరు మూయించార‌ని, అబార్షన్ చేసుకోవాలంటూ బెదిరించార‌ని, ఈ విష‌యం బయటపెడితే చంపేస్తామంటూ బెదిరించిన‌ట్టు పోసాని సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట పెట్టాడు. ఇక ఆ అమ్మాయికి అబార్షన్ చేయించి, రూ.5కోట్ల‌కు బేరం మాట్లాడుకుని ఆ అమ్మాయిని వ‌దిలించుకున్నార‌ని పోసాని చెప్పాడు. ఇక ఆ ఘ‌ట‌న జీర్ణించుకోలేక ఆ అమ్మాయి పిచ్చిదానిలాగా తిరుగుతోంద‌ని, జ‌గ‌న్‌ను ప్ర‌శ్నిస్తున్న ప‌వ‌న్ ఆమెకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు పోసాని. అప్పుడే ప‌వ‌న్ నిజాయితీ తెలుస్తుంద‌ని, రియ‌ల్ లైఫ్‌లో కాపాడే వాడే హీరో అని, అది వ‌ప‌న్ క‌ల్యాణ్ నిరూపించుకోవాలంటూ పోసాని స‌వాల్ విసిరారు. అయితే గ‌తంలో కత్తి మహేష్ సేమ్ ఇలాగే పూనమ్ కౌర్ పేరు చెప్పి వ‌రుస ట్వీట్లు చేసేవాడు. దీంతో ఆ అమ్మాయి, ఇప్పుడు పోసాని చెప్పిన అమ్మాయి ఒక్క‌రేనా అనే ప్ర‌శ్న క‌లుగుతోంది.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *