Breaking News

క్రికెటర్ గా రాణిస్తున్న రాజమౌళి మేనకోడలు.. ఏ టీమ్ తరపున ఆడుతుందో తెలుసా ?

ప్రస్తుతం సమాజంలో ఆడ మగ అనే తేడా లేదు. ఈ రంగం ఆ రంగం అనే బేధం లేదు. అన్ని చోట్ల అమ్మాయిలు అద్భుతంగా రాణిస్తున్నారు. ఒకప్పుడు ఆడవారు అంటే ఇవే పనులు చేయాలి. ఇవే ఆటలు ఆడాలి. ఇక్కడికే వెళ్లాలి అంటూ ఎన్నో కట్టుబాట్లు ఉండేవి. కానీ ప్రస్తుతం అన్ని రూల్స్ చెత్త బుట్టలోకి వెళ్లిపోయాయి. అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడా లేదు. మగవారితో సమానంగా ఆడవారు కూడా క్రీడల్లో రాణిస్తున్నారు. అంతకంటే ఎక్కువగానే ఆయా రంగాల్లో సత్తా చాటుతున్నారు కూడా. తాజాగా ఓ టాప్ దర్శకుడి ఫ్యామిలీ అమ్మాయి కూడా స్పోర్ట్స్ క్లబ్ లోకి చేరింది. ఇంతకీ ఆ సెలబ్రిటీ ఎవరు? ఆ అమ్మాయి ఎవరు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఆ సెల్రబిటీ మరెవరో కాదు.. దర్శక దిగ్గజం రాజమౌళి కొడలు ఇషిత. ఈ అమ్మాయి ప్రస్తుతం హైదరాబాద్ ఉమెన్ క్రికెట్ టీంలో ప్లేయర్ గా కొనసాగుతుంది. నిజానికి ఈ విషయం చాలా మందికి తెలియదు. తాజాగా ఉమెన్ అండర్-19లో ఆమె ఆట తీరుకు జనాలు ఫిదా అయ్యారు. ప్రస్తుతం రాజ్ కోట్ లో జరుగుతున్న ఈ పోటీల్లో ఉత్తరప్రదేశ్ తో హైదరాబాద్ టీం పోటీకి దిగింది. అందులో బౌలర్ గా ఇషిత 3 వికెట్లు తీసింది. ఈ మ్యాచ్ గెలిచేందుకు ఆమె బౌలింగ్ ఎంతో ఉపయోగపడింది. తాజాగా ఈ విషయాన్ని రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.

నిజానికి తన పిల్లలను క్రీడల్లోకి పంపించాలి అనుకున్నట్లు రాజమౌళి వెల్లడించాడు. కానీ వారు తమకు నచ్చిన రంగాల్లోకి వెళ్లినట్లు చెప్పాడు. కానీ తన మేన కోడలు ఇషిత మాత్రం హైదరాబాద్ ఉమెన్ క్రికెట్ టీమ్ కు ఎంపికయినట్లు చెప్పాడు. అందేకాదు.. హిమాచల్ ప్రదేశ్ తో జరిగే పోటీలో పాల్గొనబోతున్నట్లు తెలిపాడు. ఈ సందర్భంగా ఇషితకు ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ప్రస్తుతం దర్శక ధీరుడి ట్వీట్ బాగా వైరల్ అవుతోంది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *