Breaking News

కోరిక తీర్చాలని ప్రగతి వెంటపడిన ఆ కమెడియన్ ఎవరు? .. సీన్ కట్ చేస్తే…

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ పేరు సంపాదించుకుంది యాక్ట్రస్ ప్రగతి. ఎప్పిటికప్పుడు సోషల్ మీడియాలో తన డ్యాన్స్ వీడియోలు పెడుతు యంగ్ హీరోయిన్స్‌తో పాటు డ్యాన్స్ చేయడంలో తానేమి తక్కువ కాదనే హింట్ ఇస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అమ్మ, వదిన వంటి క్యారెక్టర్స్ చేస్తూ మంచి ఆఫర్స్ సొంతం చేసుకుంటోంది ప్రగతి. ఇక ఎఫ్2 మూవీలో వెంకటేశ్‌కు అత్తగా నటించి ఆ రోల్‌కు 100 పర్సెంట్ న్యాయం చేసింది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఆమె హీరోయిన్‌గా చేసింది. తర్వాత బ్రేక్ తీసుకుంది. అనంతరం ఫ్యామిలీ లైఫ్ లోకి వెళ్లాక విభేదాలు రావడంతో భర్తకు దూరంగా ఉంటుంది. అనంతరం ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. మంచి రోల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ఓ యూ ట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని సంచలన విషయాలను రివీల్ చేసింది..

20 ఏండ్లకే పెళ్లి చేసుకోవడంతో తన లైఫ్ హ్యాపీగా కొనసాగలేదని వాపోయింది. చిన్న ఏజ్‌లోనే పెళ్లి చేసుకుని తప్పుచేశానని బాధపడింది. ఇక కాస్టింగ్ కౌచ్‌కు సంబంధించిన విషయాలు చెబుతూ.. ఒకానొక టైంలో తాను సైతం సెక్సువల్ హెరాస్‌మెంట్‌కు గురయ్యానని చెప్పింది. ఇండస్ట్రీకి చెందిన ఓ టాప్ కమెడియన్ ఆయన కోరిక తీర్చాలంటూ తన వెంటపడ్డాడని చెప్పుకొచ్చింది. ఓ మూవీ షూటింగ్ జరుగుతుండగా తనను కేరోవ్యాన్ లోకి పిలిచి లైంగికంగా వేధించాడంటూ చెప్పింది. అయితే ఆ టైంలో అతనికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చానని, ఇక అతడు తన జోలికి రాలేదని చెప్పింది. క్యాస్టింగ్ కౌచ్ ఓన్లీ సినీ ఇండస్ట్రీకే పరిమితం కాలేదని, చాలా రంగాల్లో మహిళలు వేధింపులకు గురవుతున్నారని తెలిపింది. ఆ టైంలో మనం తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి అంటూ చెప్పుకొచ్చింది. ఇటీవలే మీటూ ద్వారా చాలా మంది యాక్ట్రస్‌లతో పాటు సెలబ్రిటీలు సైతం ముందుకొచ్చి తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఓపెన్ అయిన విషయం తెలిసిందే. ఇందులో కొందరు కొంతమంది పెద్దమనుషులపై ఆరోపణలు సైతం చేశారు.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

One comment

  1. మామూలే కదా ఎప్పుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *