Breaking News

కోట్ల రూపాయలు తీసుకునే నయనతార.. కారు ఈఎంఐ ఎందుకు కట్టలేకపోయింది? ప్రేమే శాపమా ?

నయనతార. టాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. గడిచిన దశాబ్దానికి పైగా తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగుంది. ఇప్పటికే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న ఈ అమ్మడు.. ఇప్పటికీ పలు సినిమాలు చేస్తూ ముందుకు సాగుతుంది. సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన కొద్ది రోజులకే ఈమె స్టార్ హీరోయిన్ స్థాయిని సంపాదించుకుంది. అయితే ఈ అందాల తారకు ఎన్నో ప్రేమకథలు ఉన్నాయి. అందులో ఓ వ్యక్తి మూలంగా తను చాలా ఇబ్బందులు పడింది. ఇంతకీ తన వల్ల నయనతార ఎలాంటి ఇబ్బందులు పడిందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఒకానొక సమయంలో తన కారుకు ఈఎంఐ కట్టలేని పరిస్థితి ఎదుర్కొంది నయనతార. ఇంతకీ ఆమె ఈ ఇబ్బంది ఎందుకు పడింది అనేది జనాలకు తెలియదు. కానీ అది వాస్తవం. 2006లో వెంకటేష్ హీరోగా వచ్చిన లక్ష్మీ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో తను మంచి పేరు సంపాదించుకుంది. తెలుగుతో పాటు పలు భాషల్లోనూ తను హీరోయిన్ గా చేసింది. కొద్ది కాలంలోనే భారీగా రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి చేరింది. కోట్ల రూపాయలు తీసుకుని సినిమాలు చేసింది. కానీ డ్యాన్సర్ ప్రభుదేవాతో ప్రేమలో పడి చాలా ఇబ్బంది పడింది. ఆయనతో ప్రేమలో ఉన్నంత కాలం ఎన్నో అవస్థలు పడింది.

ప్రభుదేవాతో ప్రేమలో ఉన్న సమయంలో నయనతార బీఎండబ్ల్యూ కారు తీసుకున్నది. అదికూడా ఈఎంఐలో తీసుకుంది. అయితే ఒక్కో సినిమాకు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే ఈ అమ్మడు.. ఇన్ స్టాల్ మెంట్లో కారు కొనడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఎన్నో కోట్ల రూపాయలు తీసుకునే నయనతార డబ్బు అంతా ఏమైంది? అని చాలా మంది చర్చించుకున్నారు. అంతేకాదు.. చివరకు కారుకు ఈఎంఐ కట్టలేక కారును కూడా వదులుకున్నట్లు తెలుస్తోంది. అయితే తన డబ్బు మొత్తం పోవడానికి కారణం ప్రభుదేవా అని.. అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె పలు సినిమాల్లో నటిస్తూ బాగానే సంపాదిస్తుంది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *