Breaking News

కూతురిని మెగాస్టార్ చిరుకు అప్పగిస్తూ అల్లు రామలింగయ్య చెప్పిన మాటలివే..

స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య వెండితెర మీద కనబడితే చాలు నవ్వులు నవ్వులే.. ఆయన నటించిన ప్రతీ సినిమాలో డిఫరెంట్ మ్యానరిజం ప్రదర్శించి తనకంటూ ఓ సెపరేట్ స్పెషల్ రికగ్నిషన్ తెచ్చుకున్నారు అల్లు రామలింగయ్య. ఇకపోతే అల్లు రామలింగయ్య తన కూతురును మెగాస్టార్ చిరంజీవికి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే, చిరంజీవి భవిష్యత్తు పెళ్లి అయిన తర్వాతనే బాగా వెలిగిపోయిందని ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో అంటుంటారు.

చిరంజీవిని అల్లు వారి అల్లుడు చేయడంలో మేకప్ మ్యాన్ జయకృష్ణ కీలక పాత్ర పోషించారు. ‘మనఊరి పాండవులు’ చిత్రంలో తన ఫ్రెండ్స్‌తో కలిసి నటుడు అల్లు రామలింగయ్యను ఏడిపించే సీన్‌ సందర్భంలో మొదటి సారి రామలింగయ్యను చిరు కలిశారు. ఆ తర్వాత ఆయన్ను మళ్లీ కలిసేందుకు రామలింగయ్య గారి ఇంటికి వెళ్లగా, ఆయన ఆ సమయంలో లేరు. రామలింగయ్య సతీమణి ఉండగా, ఆమె చిరంజీవితో మాట్లాడి కొద్దిసేపటి తర్వాత ఓ కాఫీ పంపించారు. ఆ తర్వాత చాలా కాలం తర్వాత తెలిసిన విషయమేమిటంటే.. కాఫీ ఇచ్చిన ఆ అమ్మాయి సురేఖనేనని.

ఇకపోతే నటుడు కైకాల స‌త్యనారాయ‌ణ‌తో చిరంజీవి గురించి అడిగి తెలుసుకున్నాడు రామ‌లింగ‌య్య‌. ఆ తర్వాత 1980 ఫిబ్ర‌వ‌రి 20న‌ చిరు-సురేఖ పెళ్లి జ‌రిగింది. సురేఖ‌ను చిరంజీవి చేతుల్లో పెడుతూ అల్లు రామలింగయ్య ‘చూడు బాబూ.. నువ్వేమో కొంచెం స్పీడు మనిషివి, అయితే, మా ఇంట్లో అర‌వింద్‌, భార‌తి, వ‌సంత అంద‌రూ క‌చ్చితంగా మాట్లాడ‌గ‌లిగిన‌ వారే. కానీ ఇప్ప‌టిదాకా ఏదేని విషయమై ఏ రోజూ ఏది అడ‌గ‌ని నెమ్మ‌ద‌స్తురాలు సురేఖ‌ ఆమెను బాగా చూసుకోవాల‌య్యా’ అని చిరంజీవికి చెప్పారు అల్లు రామలింగయ్య. ఇక అల్లు రామలింగయ్య చెప్పినట్లుగానే సురేఖను చాలా బాగా చూసుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి వెళ్లే ప్రతీ ఫంక్షన్‌కు దాదాపుగా సురేఖను తీసుకెళ్తూ ఉంటారు. సురేఖ సైతం మెగాస్టార్ చిరంజీవికి అన్ని విషయాల్లో సపోర్ట్ ఇచ్చి పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూ ఉత్తమ ఇల్లాలిగా కొనసాగుతోంది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *