Breaking News

కీర్తితో విడాకుల తర్వాత.. సుమంత్ ప్రేమాయణం నడిపిన ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

సుమంత్. అక్కినేని కుటుంబం నుంచి మూడో తరం హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ఆయన అక్కిని నాగేశ్వర్ రావుకు స్వయంగా మనవడు. కెరీర్ తొలినాళ్లలో కాస్తోకూస్తో మంచి సినిమాల్లో నటించినా.. ఆయనకు పెద్దగా గుర్తింపు రాలేదు. అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అదే సమయంలో తొలిప్రేమ సినిమాతో ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి రెడ్డిని సుమంత్ ప్రేమించాడు. కొంత కాలం పాటు వీరి ప్రేమాయణం కొనసాగింది. ఆ తర్వాత ఇద్దరూ పెద్దల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కొంత కాలం పాటు వీరిద్దరు చక్కటి జీవితాన్ని గడిపారు. ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ.. నెమ్మదిగా ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. రోజు రోజుకూ అవి ముదిరాయి. చిరవరకు కలిసి ఉండలేం అనే స్థాయికి ఈ గొడవలు చేరాయి. 2005లో వీరు ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.

విడాకుల తర్వాత సుమంత్, కీర్తిరెడ్డి ఎవరి దారుల్లో వారు వెళ్లారు. కీర్తి మరో అబ్బాయిని పెళ్లి చేసుకుంది. పిల్లా పాపలతో సంతోషంగా జీవితాన్ని లీడ్ చేస్తుంది. సుమంత్ మాత్రం ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. అయితే కీర్తి రెడ్డితో తెగదెంపులు చేసుకున్న తర్వాత ఇద్దరు హీరోయిన్లతో ప్రేమాయణం నడిపినట్లు ఇండస్ట్రీలో రూమర్లు వచ్చాయి. వారిలో ఒకరు ఛార్మి కాగా, మరొకరు కమలినీ మఖర్జీ. వీరిద్దరితో ఆయనకు ఎఫైర్లు ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడిచింది.

ఈ వార్తల్లో వాస్తవం ఏమాత్రం నిజం అనేది ఇప్పటికీ తెలియదు. కానీ సుమంత్ వారితో సినిమాలు తీస్తున్న సమయంలోనే ఈ గాసిప్స్ వినిపించాయి. ఆ తర్వాత ఎలాంటి వార్తలు రాలేదు. అటు ఈ వార్తల గురించి ఛార్మి, కమలినీ ముఖర్జీగానీ, సుమంత్ గానీ ఏనాడూ స్పందించలేదు. అసలు ఈ వార్తలను వారు పట్టించుకోలేదు కూడా. అయితే విడాకులు తీసుకున్నాక 16 ఏండ్లకు అంటే ఈ ఏడాది సుమంత్ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో వాస్తవం ఎంత అనేది మున్ముందు తేలనుంది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *