Breaking News

కార్తీక‘దీపం’ ఆరిపోనుందా.. మోనితకు కొడుకు.. దీప కన్నుమూత

బుల్లితెరపై సందడి చేస్తున్న సీరియల్స్‌లో దాదాపు అందరి ఫేవరెట్ సీరియల్‌గా ‘కార్తీక దీపం’ ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ సీరియల్‌లోని పాత్రలైన డాక్టర్ బాబు, వంటలక్క అలియాస్ దీప గురించి ప్రతీ ఇంట్లో గృహిణులు చర్చించుకుంటారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో మోస్ట్ పాపులర్ సీరియల్‌గా ఈ సీరియల్ ఉంది. నిరుపమ్, ప్రేమి విశ్వనాథ్ డాక్టర్ బాబు, దీప పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి నటిస్తారని ఎప్పుడూ అనకుంటుంటారు. ఈ సీరియల్‌లో ప్రజెంట్ ట్విస్టుల మీద ట్విస్టులు తెర మీదకు వస్తున్నాయి. రోజురోజుకూ రసవత్తరంగా సాగుతున్న ఈ సీరియల్‌లో సంచలన ట్విస్ట్ రాబోతున్నదని తెలుస్తోంది. అదేంటంటే..

ఇటీవల ప్రసారమైన ఎపిసోడ్స్‌లో డాక్టర్ బాబు కార్తీక్ తన అమెరికా ప్రయాణాన్ని వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. అందుకు కారణం మోనిత జైలు నుంచి విడుదల కావడమే కాదు. ఆమె కృత్రిమ గర్భం దాల్చి నిండు గర్భిణిగా బయటకు వస్తుంది. ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో మోనిత పురిటి నొప్పులతో హాస్పిటల్‌కు వెళ్తుంది. అక్కడ ఆమె హెల్త్ కండీషన్ బాగా సీరియస్ ఉండగా, కార్తీక్ వస్తే కాని తాను ఆపరేషన్ చేయించుకోబోనని మోనిత పట్టు పడుతుంది. ఈ విషయమై భారతి కార్తీక్‌కు ఫోన్ చేయగా, కార్తీక్ భారతిపై ఫైర్ అవుతాడు. చివరకు మోనితకు బాబు పుడతాడు. ఈ విషయం తెలుసుకుని డాక్టర్ బాబు కార్తీక్ కుటుంబం షాక్‌కు గురువుతుంది. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే దీప ప్రాణాలు కోల్పోతుందనే వార్త ఒకటి చర్చనీయాంశమవుతున్నది. దీప చనిపోతుందనే కథనాలు వినబడటంతో పలువురు నిజమేనా అనే చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ దీప నిజంగానే చనిపోతే సీరియల్ ముగిసిపోయినట్లేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీప మరణిస్తే పిల్లల సంగతేంటి? పిల్లలు పెద్దవారవుతారా? అనే ప్రశ్నలకు డైరెక్టర్ ఏం సమాధానం చెప్తారని అనుకంటున్నారు. ప్రేక్షకులకు అంచనాలకు తగ్గట్లుగా డైరెక్టర్ సీరియల్ ప్లాన్ చేశాడా? లేదా? అనేది తెలియాలంటే సోమవారం ఎపిసోడ్ చూస్తేనే అర్థమవుతుంది.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *