Breaking News

కళ్లెదురుగానే అమ్మాయిలతో స*సాలు.. దయలేని ‘మొగలిరేకులు’ దయా ఇందులో వాస్తవం ఎంత ?

దయా.. అలియాస్ పవిత్రనాథ్.. తెలుగు బుల్లితెరపై కొంత కాలం పాటు జనాల మనసులను దోచుకున్న మొగలిరేకులు సీరియల్ ఫేమ్. ఈ సీరియల్ ద్వారా తను ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుత తరం వారికి ఈయన గురించి తెలియదు కానీ.. కొద్ది సంవత్సరాల క్రితం టీవీ చూసే అలవాటు ఉన్న ప్రతి ఒక్కరికీ దయా తప్పక తెలిసే ఉంటాడు. సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు.. నిజ జీవితంలో మాత్రం ఎంతో మంది అమ్మాయిలు, మహిళల జీవితాలు నాశనం చేశాడట. ఈ విషయాన్ని ఎవరో కాదు.. స్వయంగా ఆయనను కట్టుకున్న భార్యే చెప్పి కన్నీరు పెట్టుకుంది. ఇంతకీ తను ఏ పనులు చేశాడో.. ఆమె ఏం చెప్పిందో ఇప్పుడు చూద్దాం..

దయా సీరియల్స్ లో నటించడంతో పాటు జాతకాలు కూడా చెప్తూ ఉండే వాడు. జాతకాల పేరుతో చాలా మంది అమ్మాయిలను, మహిళలను తీసుకొచ్చేవాడని ఆయన భార్య శశిరేఖ చెప్పింది. తన కళ్ల ముందే వారితో చేకూడని పనులు చేసే వాడని చెప్పింది. 11 ఏండ్లుగా ఆయన చేస్తున్న క్రూరమైన పనులతో చిత్ర హింసలకు గురైనట్లు వెల్లడించింది. తన బిడ్డలతో పాటు తనకు న్యాయం చేయాలని ఆమె కోర్టు గడప తొక్కింది.

2009లో శశిరేఖ, దయకు పెళ్లి జరిగింది. కొంత కాలం పాటు వీరి సంసారం బాగానే కొనసాగింది. ఆ తర్వాత తను గర్భవతి అయ్యింది. అప్పటి నుంచి దయాలో తీవ్ర మైన మార్పు వచ్చిందట. ఆమె ముఖం చూస్తేనే చిరాకు పడేవాడట. తను గర్భవతి అని చూడకుండా అత్తమామలు ఇంటి నుంచి గెంటేశారని చెప్పింది. తన నగలు అమ్మి ఇల్లు కొనుకుని ఉన్నట్లు చెప్పింది. ప్రస్తుతం తమకు 11 ఏళ్ల పాప, 8 యేళ్ల బాబు ఉన్నారని చెప్పింది. పెళ్లైనా అతడికి అమ్మాయిల మోజు తీరలేదని చెప్పింది. అమ్మాయిలతో చాటింగ్ చేస్తూ ఇంటికి రప్పించుకునేవాడని చెప్పింది. తన ముందే వారిని గదిలోకి తీసుకెళ్లేవాడని వెల్లడించింది. ఇంటేని ప్రశ్నిస్తే తీవ్రంగా హింసించేవాడని చెప్పింది. ఇంతకాలం ఓపిక పట్టిన తాను.. ఇకపై ఉండలేనని చెప్పింది. అందుకే తన నుంచి రక్షణతో పాటు పిల్లలకు భరోసా కల్పించాలని కోర్టుకు విన్నవించుకుంది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *