Breaking News

కన్న తల్లికి నిద్ర లేకుండా చేస్తున్న ప్రభాస్..!

ప్రభాస్.. పాన్ ఇండియన్ హీరో. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన అద్భుత చిత్రం బాహుబలిలో నటించి తన సత్తాను చాటుకున్నాడు. ఈ సినిమాతో ఏకంగా పాన్ ఇండియన హీరోగా ఎదిగిపోయాడు. బాలీవుడ్ నటులకు కూడా అందనంత ఎత్తుకు ఎదిగాడు. ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియన్ మూవీస్ మాత్రమే చేస్తున్నాడు. ఈ సినిమాల ద్వారా తన స్థాయిని హాలీవుడ్ రేంజికి పెంచుకోవాలి అనుకుంటున్నాడు. త్వరలోనే ఇంటర్నేషన్ స్టార్ హీరో అనిపించుకోవాలని ఎంతో ఆరాటపడుతున్నాడు. అందుకు తగిన విధంగానే పలు భారీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడు.

చాలా మంది జనాలకు ప్రభాస్ సినిమా లైఫ్ గురించి తప్ప.. వ్యక్తిగత విషయాల గురించి అంతగా ఎవరికీ తెలియదు. కేవలం జనాలకు వినోదాన్ని మాత్రమే పంచుతూ తన వ్యక్తిగత జీవితానికి కూడా చాలా దూరంగా ఉంటున్నాడు. జనాలు మాత్రం ప్రభాస్ పెళ్లి గురించి చర్చోప చర్చలు జరుపుతున్నారు. అటు తన కుటుంబ సభ్యులు కూడా ఈయన పెళ్లి గురించి చాలా ఆరాట పడుతున్నారు. ముఖ్యంగా తన తల్లి శివకుమారి కూడా ప్రభాస్ పెళ్లి గురించి బాధ పడుతుందట. అంతేకాదు.. పెళ్లి చేసుకోవాలని ఒకానొక సమయంలో తన ముందు కంటతడి పెట్టుకుందట.

నిజానికి బాహుబలి కంటే ముందే పెళ్లి చేసుకోవాలని ప్రభాస్ కు చెప్పిందట తన తల్లి. అయితే తను మాత్రం బాహుబలి సినిమా అయ్యాక చేసుకుంటనని చెప్పాడు. ఆ తర్వాత బాహుబలి-2 అన్నాడట. అనంతరం సాహో, సలార్, ఆదిపురుష్ అంటూ వరుస పెట్టి పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నాడు. తన వయసులో ఉన్న వాళ్లు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు పిల్లలు కూడా కన్నారు. ఇంకా ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అంటూ తన తల్లి ఆవేదన చెందుతుందట. ఇక ప్రభాస్ పెదనాన్ని క్రిష్ణం రాజు సతీమణి కూడా ప్రభాస్ పెళ్లికి సంబంధించి ప్రయత్నాలు మొదలు పెట్టిందట. సంప్రదాయ కుటుంబ నుంచి వచ్చే అమ్మాయి కోసం వెతుకులాట మొదలు పెట్టిందట. వీరు ప్రయత్నాలు బాగానే చేస్తున్నా.. ప్రభాస్ అందుకు ఓకే చెప్తాడో? లేదో? అని టెన్షన్ పడుతున్నారట.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *