Breaking News

కన్న తండ్రి వల్ల తమన్నా ఎన్ని సినిమాలు కోల్పోయిందో తెలుసా ?

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా.. ప్రజెంట్ టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తున్నది ఈ భామ. టాలీవుడ్ ఇండస్ట్రీకి ‘శ్రీ’అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీడేస్’ చిత్రంతో మంచి పేరు వచ్చింది. ఇక ఆ తర్వాత తమన్నా దశ మారిపోయింది. హీరోయిన్‌గా వరుస సినిమాల్లో అవకాశాలు రాగా వాటిన్నిటిలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

టాలీవుడ్ స్టార్ హీరోలు అందరితో దాదాపు యాక్ట్ చేసింది తమన్నా. ఇకపోతే ఈ భామ అప్పట్లో తన తండ్రి వల్ల చాలా పెద్ద సినిమాలు మిస్ అయిందట. ఇందుకు కారణం ఏంటంటే.. తమన్నా ఫాదర్ సంతోశ్ భాటియా కూడా సినిమా లవర్. ఈయనకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే తమన్నాను స్టార్ హీరోయిన్ చేసేందుకు చాలా కష్టపడ్డాడు. పెద్ద పెద్ద నిర్మాతల వద్దకు వెళ్లి తన కూతురికి హీరోయిన్‌గా చాన్స్ ఇవ్వాలని అడిగేవాడట. మొత్తంగా తమన్నా హీరోయిన్ అయిపోయింది. దాంతో తమన్నా డేట్స్ అన్ని చూసుకునే మేనేజర్ అయిపోయాడు తండ్రి. ఈ క్రమంలోనే సంతోశ్ భాటియాకు నటించాలనే కోరిక కలిగింది. నిర్మాతల వద్దకు వెళ్లి తనకు చిన్న వేషం ఇవ్వాలని అడగడంతో వారు ఇచ్చారు. అలా ఇక ఆయన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ తన పాత్రల కోసం అడగడం తప్ప తమన్నా డేట్స్ అస్సలు పట్టించుకోలేకపోయాడట. దాంతో డైట్స్ కుదరక చాలా పెద్ద సినిమాలను తమన్నా మిస్ అయిందట. తండ్రి ఇలా చేస్తుండటంతో ఆయన్ను పక్కనబెట్టిన తమన్నా తల్లి రజనీ, బ్రదర్ ఆనంద్ సాయంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ‘బాహుబలి’ చిత్రం తర్వాత తమన్నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా పెరిగింది. ఈ ముద్దుగుమ్మ నటించిన మ్యాచో మ్యాన్ గోపీచంద్ ‘సీటీమార్’, పవన్ కల్యాణ్ ఫ్యాన్ నితిన్ ‘మాస్ట్రో’ ఇటీవల విడుదలయ్యాయి. రెండు చిత్రాల్లోనూ తమన్నా పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. ‘సీటీమార్’ చిత్రంలో తెలంగాణ కోచ్ జ్వాలారెడ్డి తమన్నా అలరించింది. ఇక ‘మాస్ట్రో’ ఫిల్మ్‌లోనూ తమన్నా నెగెటివ్ రోల్ ప్లే చేసి మెప్పించింది.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *