Breaking News

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణానికి అదే కారణమా? వైద్యులేమంటున్నారంటే…

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండె పోటుతో యంగ్ ఏజ్ లోనే కన్నుమూశారు. పునీత్ కేవలం సాండల్ వుడ్ లోనే కాకుండా అనేక భాషల సినీ అభిమానులకు సుపరిచితుడు. పునీత్ కేవలం యాక్టింగ్ మాత్రమే కాకుండా సింగింగ్ ను కూడా చించేస్తాడు. ఇప్పటికే ఆయన చాలా సార్లు తన వాయిస్ ను మనకు పాటల ద్వారా వినిపించారు. పునీత్ పుట్టింది కర్ణాటకలో కాదు. పునీత్ రాజ్ కుమార్ చెన్నైలో పుట్టినా కూడా పునీత్ చిన్నప్పుడే ఆయన ఫ్యామిలీ కర్ణాటకు షిప్ట్ అయిపోయింది. దీంతో పునీత్ మనకు కన్నడిగుడిగానే పరిచయం.

అక్కడే పెరిగిన పునీత్ బాల నటుడిగా కన్నడ సినిమాల్లోనే ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత క్రమంగా హీరోగా ఎదిగాడు. పునీత్ తన మొదటి సినిమాను రిమేక్ స్టోరీతో చేశాడు. తెలుగులో సూపర్ హిట్ అయిన ఇడియట్ సినిమాను కన్నడలో అప్పుగా రిమేక్ చేసి బంపర్ హిట్ కొట్టాడు. క్రమంగా పునీత్ అక్కడ సూపర్ స్టార్ గా ఎదిగాడు. పునీత్ కు వర్కవుట్లు చేయడమంటే మహా ఇష్టం. ఇన్నాళ్ల తన కెరీర్ లో ఆయన ఒక్కరోజు కూడా వర్కవుట్ చేయకుండా లేడంటేనే అర్థం చేసుకోవచ్చు. పునీత్ వర్కవుట్లకు ఎంతలా ప్రాధాన్యం ఇస్తారో. అలా ఫిట్ నెస్ మీద ఎంతో కాన్సంట్రేట్ చేసే పునీత్ ఇలా గుండెపోటుతో మరణించడం చాలా బాధాకరం.

పునీత్ మరణించడానికి హెవీ వర్కవుట్లే కారణమని వైద్యులు చెబుతున్నారు. ఈ ఏజ్ లో అంత హెవీ వర్కవుట్లు చేయడం సరి కాదని చెబుతున్నారు. ఏదేమైనా కానీ ఆరోగ్యం పై ఎంతో కాన్సంట్రేట్ గా ఉండే పునీత్ రాజ్ కుమార్ గుండె పోటుతో మరణించడం చాలా విచారకరమని అభిమానులు అంటున్నారు. డెయిలీ లాగే వర్కవుట్లు చేయడానికి వెళ్లిన పునీత్ రాజ్ కుమార్ జిమ్ లోనే గుండె పోటుతో కుప్పకూలిపోయాడు. అంతకన్నా ముందు రోజు రాత్రే పునీత్ కు గుండెలో నొప్పి వచ్చినట్లు పలువురు తెలుపుతున్నారు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *