Breaking News

ఒకేసారి ఎన్నో మెట్లు ఎక్కిన సాయి ధరమ్ తేజ్.. ఆగని ట్విట్టర్ల వెల్లువ

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా సినిమా రిపబ్లిక్. దేవ కట్ట దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కంప్లీట్ పొలిటికల్ బ్యాగ్రౌండ్ తో ముందుకు సాగుతుంది. ఈ సినిమాపై ప్రస్తుతం భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే దేవ కట్ట, సాయి ఈ అంచనాలను అందుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి స్పెషల్ షో ఏర్పాటు చేశారు. పలువురు సినిమా పెద్దలు, జర్నలిస్టులు ఈ సినిమాను చూశారు. ఈ సినిమా అద్భుతంగా ఉందంటూ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దేవ కట్ట కథ, కధనం, మాటలు, దర్శకత్వం అన్నీ చక్కగా కుదిరాయంటున్నారు. సాయి ధరమ్ తేజ్ నటన ఓ రేంజిలో ఉందంటున్నారు. సోషల్ మీడియా వేదిక ఈ సినిమాకు సంబంధించి ఫుల్ పాజిటివ్ కామెంట్స్ ఇస్తున్నారు. ఇంతకీ ఈ సినిమాకు గురించి ఎవరెవరు తమ అభిప్రాయాలను వెల్లడించారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

తేజ్‌ నటన అద్భుతం అంటున్నా ఈ సినిమా చూసిన వ్యక్తులు. సినిమా చూస్తున్నంత సేపే కాదు.. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మనులో నిలిచిపోతున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాలో నటన ద్వారా సాయి పది మెట్లు ఎక్కినట్లు వెల్లడిస్తున్నారు. ఈ సినిమాలో ఉన్న డైలాగులు అత్యద్భుతంగా ఉన్నట్లు వెల్లడిస్తున్నారు. రిపబ్లిక్‌ ఆలోచనలను రేకెత్తించే సినిమా. దేవకట్ట అద్భుతంగా డైలాగులు రాశాడు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఈ సినిమా ప్రతిబింబిస్తోందని మరో నెటిజన్‌ వెల్లడించాడు. నువ్వు వ్యవస్థలో ఉండకపోతే.. వ్యవస్థ నుంచి బయటకు పోవాల్సి వస్తుంది అనే డైలాగ్ బాగా ఆకట్టుకుంటుందన్నాడు. అటు ఈ సినిమాలో ఒక్క సీన్ కూడా అవసరం లేదు అనిపించేలా లేదటున్నాడు.

మొత్తంగా ఈ సినిమాపై సర్వత్రా పాజిటివ్ టాక్ వస్తుంది. మొన్న లవ్ స్టోరీ.. తాజాగా రిపబ్లిక్ సక్సెస్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో మళ్లీ సినిమాల సందడి మొదలు కాబోతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. తాజా సినిమాతో సాయి మరింత స్వింగ్ లో కొనసాగే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *