Breaking News

ఎవరో చేసిన తప్పుకు పాపం కొండవలస బలయిపోయాడా ?

కమెడియన్ కొండవలస గురించి తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్తగా పరిచయం అవసరం లేదనుకుంట.. ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టి తొలి సినిమాతోనే మంచి కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కొండవలస అందరి హృదయాల్లో నిలిచిపోతారు. అయితే, కెరీర్ మంచిగా కొనసాగుతున్న దశలో అనుకోకుండా అనారోగ్యం పాలై 2015 నవంబర్ 2 ఆయన మృతి చెందాడు. అయితే, ఎవరో చేసిన తప్పుకు కొండవలస బలయ్యాడని అప్పట్లో పెద్ద ఎత్తున రూమర్లు వచ్చాయి. అందుకు జగబాతి, కళ్యాణి జంటగా నటించిన కబడ్డీ కబడ్డీ మూవీనే కారణమని కూడా పరోక్షంగా ఆరోపణలు వినిపించాయి.

చిత్రపరిశ్రమలో కొండవలస లక్ష్మణరావు పూర్తి పేరు చాలా తక్కువ మందికి తెలుసు. ఆయన పుట్టి పెరిగింది శ్రీకాకుళం జిల్లాలోని కొండవలస ప్రాంతం. చాలా మందికి ఇంటిపేర్లు వేరే ఉంటాయి. కానీ లక్ష్మణరావుకు తన ఊరిపేరే ఇంటి పేరుగా మారిపోయింది. మొదట్లో ఈయన వైజాగ్ పోర్టులో పనిచేసేవాడట. వెయ్యికి పైగా నటకాల్లో నటించాడని తెలిసింది. ఆయన నటనా శైలి నచ్చాక వంశీ తన మూవీలో అవకాశం ఇచ్చాడని తెలిసింది. ఓను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు మూవీతో సినీ ఆరంగేట్రం చేసిన కొండవలస తిరిగి వెనక్కి చూడలేదు. ఆ సినిమాలో పెళ్లానికి భయపడే భర్తగా.. నేను ఒప్పుకోను.. అయితే ఒకే.. అనే ఒక్క డైలాగ్‌తో చాలా ఫేమస్ అయ్యారు.

ఆ తర్వాత చాలా ఆఫర్లు ఆయన తలుపుతట్టాయి. అయితే, కబడ్డీ కబడ్డీ సినిమా టైంలోనే ఆయనకు చెవి ఇన్ ఫెక్షన్ సోకి అది కాస్త విషమించి ఆయన మరణించారని అప్పట్లో చాలా వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే, ఆ మూవీలో కమెడియన్స్ అందరూ పేకాట ఆడుతున్న సమయంలో పోలీసులను చూసి అందరూ తలో దిక్కుకు పారిపోతారు. ఆ సమయంలో కొండవలస చెరువులో దూకి తప్పించుకునే సీన్ ఉంది. అది చేశాక చెరువులోని నీళ్లు చెవులోకి , నోట్లోకి వెళ్ళఢంతో ఇన్ ఫెక్షన్ అయ్యిందని కొందరు అంటున్నారు. ఆ చేపల చెరువులో యాజమాని రసాయనాలు కలపడంతో కొండవలసకు ఇన్ ఫెక్షన్ అయ్యిందని కొందరి వాదన. అది కాస్త ముదిరి మెదకు ఎక్కడంతో ఆయన చనిపోయారట. ఇన్ ఫెక్షన్ విషయం ముందే తెలిసినా దర్శకనిర్మాతలు పట్టించుకోకపోవడం వల్లే ఆ వ్యాధి ముదిరి కొన్నాళ్లకు ఆయన మరణించారని అప్పట్లో జోరుగా వార్తలు వచ్చాయి.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *