Breaking News

ఎవరు ఈ జూనియర్ సౌందర్య.. ఈమె బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా ?

దివంగత హీరోయిన్ సౌందర్యను ఇష్టపడని వారు ఉండరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ‘మహానటి’ సావిత్రి మాదిరిగా హీరోయిన్ సౌందర్యను కూడా ప్రజలు తమ గుండెల్లో పదిలపరుచుకున్నారు. తెలుగు భాషలోనే కాదు మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన సౌందర్య.. ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది. స్టార్ హీరోలు అందరి సరసన దాదాపుగా హీరోయిన్‌గా యాక్ట్ చేసింది సౌందర్య. అయితే, దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో హీరోయిన్ సౌందర్య చనిపోయింది.

సౌందర్య భౌతికంగా లేకపోయినప్పటికీ ఆమె సినిమాల్లో పోషించిన పాత్రల ద్వారా జీవించే ఉందని చెప్పొచ్చు. టెలివిజన్‌లో సౌందర్య నటించిన సినిమా వస్తుందంటే.. చాలు. తెలుగు ప్రజలు ఆ సినిమాను కంప్లీట్‌గా చూస్తుంటారు. కాగా, ఆ సౌందర్య మళ్లీ పుట్టిందండోయ్.. అవునండీ.. మీరు చదివింది నిజమే. అయితే, అచ్చు సౌందర్య ముఖ కవళికలు, రూపురేఖలతో ఓ అమ్మాయి ఉంది. ఆమెకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి. ఈమెను చూసి సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సౌందర్య మళ్లీ పుట్టిందని, జూనియర్ సౌందర్య అని అనుకుంటున్నారు. ఈ అమ్మాయి కూడా హీరోయిన్ సౌందర్య వీరాభిమాని కావడం విశేషం. టిక్ టాక్ చిత్రాజీ అనే పేరిట ఈమెకు ఇన్ స్టా గ్రామ్‌లో అకౌంట్ ఉంది. ఈ చిత్రాజీ అకౌంట్‌కు ఇన్ స్టాలో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. చిత్ర అండర్ స్కోర్ జీ2 అనే పేరుతో ఉన్న ఈ అకౌంట్‌లో సదరు అమ్మాయి చేసిన వీడియోలు ఉండగా, అందులో అచ్చు సౌందర్యలాగానే కనబడుతోంది. సౌందర్య లాగానే ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ సౌందర్య సినిమాల్లోని పాటలకు సంబంధించిన వీడియోలు చేసింది చిత్రాజీ. దాంతో నెటిజన్లు ఆ వీడియోలు చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సౌందర్య మళ్లీ పుట్టిందని, జూనియర్ సౌందర్య అని పొగిడేస్తున్నారు. చిత్రాజీ2 ఇన్ స్టా అకౌంట్ ప్రొఫైల్ చూస్తే మీకు సౌందర్య మళ్లీ గుర్తుకొస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *