Breaking News

ఎన్ని కోట్లు ఇచ్చిన అక్కడ సినిమా చేయమంటూ మొండికేస్తున్న టాలీవుడ్ సెలబ్స్

దేశంలో ఎన్నో సినిమా పరిశ్రమలున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అంటూ చాలా చాలా ఉన్నాయి. వాటన్నింటికి పెద్ద దిక్కుగా ఉంది బాలీవుడ్. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అందరూ.. బాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఒక్కసారి అక్కడ అవకాశం వచ్చిందంటే చాలా ఏ నటీనటుడైనా ఎగిరి గంతేస్తారు. కానీ మన నార్త్ కు చెందిన కొందరు నటీ నటులు బాలీవుడ్ అగ్ర నిర్మాతల సినిమాల్లో అవకాశాలు వచ్చినా సింపుల్ గా నో చెప్పారు. మహేష్ బాబు నుంచి రజనీకాంత్ వరకు చాలా మంది బాలీవుడ్ ఆఫర్స్ రిజెక్ట్ చేశారు. ఇంతకీ బాలీవుడ్ మూవీస్ రిజెక్ట్ చేసిన సౌత్ స్టార్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

*మహేష్ బాబు
బాలీవుడ్ నుంచి చాలా సినిమా ఆఫర్లు వచ్చినా వద్దు అని చెప్పిన నటుడు ఎవరైనా ఉన్నారంటే.. తను మహేష్ బాబు మాత్రమే. ఇతడి బాలీవుడ్ లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే ఈయనతో హిందీలో పలు సినిమాలు రీమేక్ చేయాలి అనుకున్నారు. కానీ తను చేయడానికి ఇష్టపడలేదు.

*అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు రెండు హిందీ సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. కానీ తను రిజెక్ట్ చేశాడు. అయితే మంచి కథ దొరికితే మాత్రం చేయడానికి రెడీగా ఉన్నట్లు వెల్లడించాడు.

*నాగ చైతన్య
ఇతడికి కూడా పలు బాలీవుడ్ సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. కొన్ని సినిమాల్లో మెయిన్ రోల్స్ రాగా.. మరికొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ వచ్చాయి. కానీ రిజెక్ట్ చేశాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో పలు సినిమాలు చేసేందుకు మొగ్గు చూపుతున్నాడు.

*నివిన్ పౌలి
మలయాళం స్టార్ హీరో నివిన్ కూడా బాలీవుడ్ సినిమాలను రిజెక్ట్ చేవాడు. డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఇతడితో సినిమా చేయాలి అనుకున్నాడు. కానీ తను నో చెప్పాడు.

*రమ్య క్రిష్ణ
ఒకప్పటి స్టార్ హీరోయిన్.. బాహుబలితో తన సత్తా చాటుకున్నరమ్య క్రిష్ణ కూడా పలు హిందీ సినిమాలను రిజెక్ట్ చేసింది. బాహుబలి సినిమా తర్వాత తనకు బీ టౌన్ నుంచి పలు ఆఫర్లు వచ్చాయి. కానీ తను నో చెప్పింది.

*అనుష్క శెట్టి
అటు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ అనుష్కకు హిందీ నుంచి పలు ఆఫర్లు వచ్చాయి. కరణ్ జోహార్ సినిమాల్లోనూ ఛాన్స్ వచ్చింది. కానీ తను నో చెప్పింది.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *