Breaking News

ఎన్టీఆర్ చేతికి గాయం.. స‌ర్జ‌రీ చేసిన డాక్ట‌ర్లు.. అసలు ఎం జరిగింది

తార‌క్‌ను అభిమానులు ఎంత‌లా ఇష్ట‌ప‌డుతారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న‌కు ఏదైనా ఆప‌ద వ‌స్తే మాత్రం త‌మ ఇంట్లో మ‌నిషికి జ‌రిగిన‌ట్టే ఫీల్ అయిపోతుంటారు. అందుకే ఎన్టీఆర్ అంద‌రి అభిమాన‌న‌టుడు అయ్యాడు. కాగా ఆయ‌న దీపావళి పండుగ సంద‌ర్భంగా త‌న ఫ్యామిలీతో ఆనందంగా గ‌డిపారు. సంబురంగా పండుగ జ‌రుపుకున్నారు. ఈ క్ర‌మంలోనే తన ఇద్ద‌రు కుమారుల‌తో క‌లిసి దిగిన బ్యూటిఫుల్ ఫోటోను సోషల్ మీడియా వేదిక‌గా పంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫొటో కొద్ది నిముషాల్లోనే ట్రెండింగ్ లోకి వ‌చ్చేసింది.

ఇక్క‌డే అభిమానులు ఒకింత క‌ల‌వ‌రానికి గుర‌వుతున్నారు. ఎందుకంటే ఆ ఫొటోలో తారక్ చేతికి క‌ట్టుఉ క‌నిపిస్తోంది. దాంతో ఏమై ఉంటుందా అని అంతా కామెంట్లు పెట్టేస్తున్నారు. వాస్త‌వానికి రీసెంట్ గా ఎన్టీఆర్ జిమ్‌లో వ‌ర్కౌట్స్ చేస్తుండ‌గా గాయపడ్డార‌ని తెలుస్తోంది. ఆయ‌న కుడి చేతి వేలికి దెబ్బ తాక‌డంతో ఆయ‌న ట్రీట్ మెంట్ చేయించుకున్నారు. నాలుగు రోజుల క్రితం ఆయన్ను ప‌రిశీలించిన డాక్ట‌ర్లు ఆ వేలికి మైన‌స్ సర్జరీ చేశార‌ని స‌మ‌చారం. ఇక స‌ర్జ‌రీ చేసిన కార‌ణంగా ఆయ‌న్ను ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాలంటూ సూచించారంట వైద్యులు.

దీంతో తారక్ ఇంట్లోనే కుటుంబ స‌భ్యుల‌తో సంతోషంగా గ‌డుపుతున్నారు. ఈ విష‌యం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిపోయింది. తార‌క్ అభిమానులు ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటున్నారు. ఇక రీసెంట్ గానే రాజమౌళితో చేస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ చిత్రీక‌ర‌ణ కంప్లీట్ చేశాడు తార‌క్‌. ఇందులో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ ఎంత‌లా ఆక‌ట్టుకుంటున్నారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇక దీని త‌ర్వాత కొరటాల శివ డైరెక్ష‌న్ లో త‌న 30వ సినిమా చేస్తున్నాడు జూనియ‌ర్ ఎన్టీఆర్‌. ఇక ఆర్ ఆర్ ఆర్ కోసం అభిమానులు చాలా ఆత్రుత‌గా వెయిట్ చేస్తున్నారు. మ‌రి ఎన్టీఆర్ ఎలా మెస్మ‌రైజ్ చేస్తాడో చూడాలి.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *