Breaking News

ఎంతో చెప్పి చూసాం కానీ సమంత ఒప్పుకోలేదు : చై తల్లి లక్ష్మి

సమంతా, నాగ చైతన్య విడాకులు వ్యవహారంపై గత కొంత కాలంగా వస్తున్న వార్తలకు బ్రేక్ పడింది. తామిద్దరం విడిపోతున్నట్లు నాగ చైతన్య, సమంతా ప్రకటించారు. ఇకపై ఎవరి దారి వారిదేనని ప్రకటించారు. ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. చాలా చర్చల తర్వాతే ఈ వివాహ బంధం ఇక కొనసాగబోదనే నిర్ణయానికి వచ్చారు. ఇద్దరూ ఇకపై విడిపోతున్నట్లు వెల్లడించారు. నాగచైతన్య, సమంతా విడిపోకుండా ఉండేందుకు అక్కినేని ఫ్యామిలీతో పాటు మరో ఫ్యామిలీ తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇంతకీ వాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

అక్కినేని నాగ చైతన్య. దగ్గుబాటి ఆడపడుచుకు పుట్టిన అబ్బాయి. అక్కినేని నాగార్జున మొదట దగ్గబాటి రామానాయుడు కూతురు లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. ఈ ఇద్దరు దంపతులకు చైతన్య జన్మించాడు. ఆ తర్వాత నాగార్జునకు, లక్ష్మీకి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో వాళ్లిద్దరు విడిపోయారు. ఆ తర్వాత నాగార్జున.. అమలను పెళ్లి చేసుకున్నాడు. వీరికి అఖిల్ జన్మించాడు. లక్ష్మీ కూడా మరో వివాహం చేసుకుంది. అయితే చైతన్య తల్లి తరఫున దగ్గుబాటి ఫ్యామిలీ రంగంలోకి దిగింది.

ఎలాగైనా సమంతా, నాగ చైతన్య సమంతా విడిపోకుండా చూడాలని తీవ్రంగా ప్రయత్నించారు. ఇద్దరితో కలిసి మాట్లాడారు. ఒక్కటిగా ఉండాలని పదే పదే చెప్పారు. కొడుకు కుటుంబం నిలబడేందుకు లక్ష్మి చేయని ప్రయత్నం లేదట. ఆమె తరఫున దగ్గుబాటి వెంకటేష్, సురేష్ బాబు, రానా సహా అందరూ అన్ని ప్రయత్నాలు చేశారట. అయితే వీరి ప్రయత్నాలు మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదట. తమన కెరీర్ మీద ఆంక్షలు పెడితే తట్టుకోలేనని సమంతా తేల్చి చెప్పిందట. అక్కినేని ఫ్యామిలీ తొలి నుంచి తన నటనా జీవితంపై ఆధిపత్యం చూపించేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించింది. తన రెక్కలకు అడ్డు తగులుతానంటే తట్టుకోలేనని తేల్చి చెప్పిందట. చివరకు ఈ బంధం కొనసాగడం అసాధ్యం అని భావించినట్లు తెలుస్తోంది. అందుకే తమ ప్రయత్నాలను సైతం చివరకు విరమించుకున్నారట.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *