Breaking News

ఉదయభాను ఇప్పుడు ఏం చేస్తోంది.. ఆమెను దారుణంగా తొక్కెసింది వాళ్లేనా..?

సినిమా ఆడియో ఫంక్షన్స్, బుల్లితెరపై ఏదైనా కార్యక్రమం చేయాలన్నా, ప్రత్యేకమైన ఈవెంట్స్ కోసం యాంకర్స్ అవసరం తప్పనిసరి. ఒకప్పుడు లేడీ యాంకర్స్‌కు అవకాశాలు ఎక్కువగా ఉండగా, ప్రస్తుతం మేల్ యాంకర్స్ కూడా సమానంగా రాణిస్తున్నారు. వీరంతా బుల్లితెరపై నుంచి వచ్చినవారే. తమదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను అలరించేవారు. సందడి చేసేవారు. ప్రస్తుతం టాప్ యాంకర్‌గా సుమ కనకాల కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు బుల్లితెరపై ఎన్నో ప్రొగ్సామ్స్ కు యాంకరింగ్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఉదయభాను ఒకరు. మంచి అందం, తనదైన అభినయంతో తెలంగాణ యాసలో గలగల మాట్లాడుతూ ఎన్నో ప్రొగ్రామ్స్ చేసి ఒక్కసారిగా కనిపించకుండా పోయారు.

బుల్లితెరపై యాంకర్‌గా చేస్తూనే సినిమాల్లోనూ పలు అవకాశాలు దక్కించుకుని, అభిమానులను సైతం మెప్పించారు. ఆమె కెరీర్ సంతోషంగా కొనసాగుతున్న సమయంలో ఉదయభాను లైఫ్‌లో అనుకోని ఆటంకాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే, కొందరు సెలబ్రెటీలు మాత్రం ఉదయభాను ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయినట్టు తెలుస్తోంది. ఆమె గురించి ఇండస్ట్రీలో పలు రకాల రూమర్లు క్రియేట్ చేసి అవకాశాలు రాకుండా చేసినట్టు తెలుస్తోంది. ఉదయభానుకు ఎఫైర్స్ ఉన్నాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీంతో ఆమె మానసికంగా కుంగిపోయినట్టు తెలిసింది. దీంతో ఆమెకు ఛాన్సులు కూడా తగ్గిపోయాయి. దీని వెనుక ప్రస్తుతం టాప్ యాంకర్స్‌గా కొనసాగుతున్న వారి కృషి కూడా ఉన్నట్టు అప్పట్లో పెద్ద ఎత్తున కథనాలు కూడా వచ్చాయి.

ఒకప్పుడు బుల్లితెరపై ఒక వెలుగు వెలిగి, ఎన్నో మంచి ప్రొగ్రామ్స్‌కు యాంకర్‌గా చేసిన ఉదయభాను ప్రజెంట్ చిత్ర పరిశమ్రకు పూర్తిగా దూరమయ్యారు. అందుకు గల కారణం ఎంటంటే తన జీవితంలో ఇవన్నీ జరిగాగ, ఆమె వైవాహిక జీవితానికే పూర్తి ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తోంది. పెళ్లైన కొన్ని ఏండ్లకు ఉదయభానుకు కవల ఆడపిల్లలు జన్మించడంతో తన జీవితాన్ని వారికే అంకితం చేసినట్టు తెలిసింది. పిల్లలను చూసుకుంటూ తన వివాదాల కెరీర్‌కు ఉదయభాను పూర్తిగా ఫుల్‌స్టాప్ పెట్టినట్టు ఆమె సన్నిహితులు తెలిపారు.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *