Breaking News

ఈ సారి హౌజ్ నుంచి బయటకు ఎవరు వెళ్లిపోతున్నారో తెలుసా ?

పాపులర్ తెలుగు రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ను జనాలు ఎగబడి చూస్తున్నారు. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోలో కంటెస్టెంట్స్ మధ్య విపరీతమైన కాంపిటీషన్ ఉంది. పలు టాస్కుల విషయంలో హౌజ్‌మెట్స్ గొడవ పడుతూనే టాస్కులు పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీజన్ ఫైవ్‌లో ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నది ఎవరు అనేది చర్చనీయాంశంగా ఉంది. ఎవరు హౌజ్ నుంచి బయటకు వెళ్తారోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎలిమినేషన్ నామినేషన్స్‌లో ప్రియ, మానస్, ప్రియాంక, లహరి, శ్రీరాం చంద్ర ఉన్నారు. ఇందులో ముగ్గురు ఎలిమినేట్ అయ్యే చాన్సెస్ తక్కువగా ఉండగా, ఇద్దరిలో ఒకరు డెఫినెట్‌గా బయటకు వెళ్లాల్సిందే. కాగా ఎవరు బయటకు వెళ్తారనేది తెలియాలంటే షో చూడాల్సిందే.

కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్ ప్రకారం ప్రియాంక, మానస్, శ్రీరాం చంద్ర ఎలిమినేట్ అయ్యే చాన్సెస్ అతి తక్కువగా ఉన్నాయని, ప్రియ, లహరిలో ఎవరో ఒకరి ఎలిమినేషన్ ఉంటుందని తెలుస్తోంది. వీరిరువురు హౌజ్‌లో మిగతా వారితో సరిగా కమ్యూనికేట్ కాకపోవడమే ఇందుకు కారణమట. ఇకపోతే లహరి ‘బిగ్ బాస్’ హౌజ్‌లో మేల్స్‌తోనే ఉంటుంది. మిగతా వారు ఎవరితోనూ లహరి మాట్లాడటం లేదు. ప్రియ సైతం రాత్రిపూట బాత్ రూంలో రవితో గొడవ పడింది. ఇలా చేయడం ప్రియకు మైనస్ పాయింట్ అయిందని వినికిడి. ప్రియనో లేదా లహరినో ఎలిమినేట్ చేసే చాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నట్లు టాక్.

అయితే, ఇప్పటికే ఆల్రెడీ ప్రియ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యిందని కొందరు అంటున్నారు. ఈ క్రమంలోనే హౌజ్‌లో లవ్ ట్రాక్స్ కూడా నడుస్తున్నాయి. ట్రయాంగిల్ ట్రాక్స్ కూడా రన్ అవుతున్నాయి. తమ జీవితంలో జరిగిన ప్రేమకథలను కంటెస్టెంట్స్ హౌజ్‌లో మిగతా కంటెస్టెంట్స్‌తో పంచుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *