Breaking News

ఈటీవీ సంచలన సీరియల్స్ నటీనటులు ఎలా ఉన్నారు ఇప్పుడు తెలుసా?

తెలుగు టీవీ సీరియల్స్ లో ఈటీవీ మంచి ఆదరణతో దూసుకుపోతుంది. ఈ మధ్య కాలంలో కాస్త వెనుకబడినట్లు అనిపించినా..ఇంకా తన జనాదరణ మాత్రం అలాగే కొనసాగుతుంది. కొన్ని ఛానెల్స్ లో వచ్చే సీరియల్స్ మంచి ఆదరణ దక్కించుకున్నా.. ఈటీవీ సీరియల్స్ ను మాత్రం కొట్టలేకపోతున్నాయి. ఈ టీవీలో మధుర జ్నాపకాలుగా మిగిలిపోయిన సీరియల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

లేడీ డిటెక్టివ్..
ఈటీవీ మొదలైన కొత్తలో ఈ సీరియల్ ప్రారంభం అయ్యింది. సినీ దర్శకుడు వంశీ దర్శకత్వంలో ఈ సీరియల్ రూపుదిద్దుకుంది. రాత్రి 8.30 నుంచి 9 వరకు ప్రసారం అయ్యేది. ఈ సీరియల్ లో ఉత్తర అద్భుతంగా నటించి మంచి పేరు తెచ్చుకుంది.

స్నేహ
ఈటీవీ సీరియల్స్ లో బెస్ట్ సీరియల్ స్నేహ. ఈ సీరియల్ కనీవినీ ఎరుగని రీతిలో పేరు తెచ్చుకుంది. ఈ సీరియల్ లో నటించిన హీరోయిన్ కు కూడా మంచి గుర్తింపు వచ్చింది.

అన్వేషిత
థ్రిల్లర్ టెలివిజన్ సీరియల్ అయిన అన్వేషిత.. కూడా ఈటీవీలో ప్రసారం అయి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో అచ్యుత్, యమున కీరోల్స్ పోషించారు. 1997న ఈ సీరియల్ మొదలయ్యింది. 100 ఎపిసోడ్స్ పాటు సాగిన ఈ సీరియల్ అద్భుత పేరు తెచ్చుకుంది.

అంతరంగాలు
ఈటీవీలో ప్రసారం అయిన గొప్ప సీరియల్ అంతరంగాలు. ఈ సీరియల్ ను అన్ని తానై రూపొందించాడు సుమన్. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. చాలా కాలం జనాలను ఈ సీరియల్ అలరించింది.

ఎండమావులు
ఈటీవీ చరిత్రలో అత్యంత గుర్తింపు తెచ్చుకున్న సీరియల్ ఎండమావులు. ఈ సీరియల్ జనాలకు ఎంతో బాగా నచ్చింది. ఈ సీరియల్ వస్తుందంటే చాలు జనాలు టీవీలకు అతుక్కుపోయేవారు. అంతగా అభిమానులు ఉండేవారు జనాలు. ఈ సీరియల్ తర్వాత పలు ఈటీవీ సీరియల్స్ కూడా జనాలను బాగా ఆకట్టుకున్నాయి. మంచి పేరు తెచ్చుకున్నాయి. మొత్తంగా నాటి నుంచి నేటి వరకు ఈటీవీ.. సీరియల్స్ లో రారాజుగా వెలుగొందుతుంది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *