Breaking News

ఇష్టం లేని పెళ్లి.. భార్యతో నరకం చూసిన బాబు మోహన్.. చివరికి ఏమైందో తెలుసా?

బాబు మోహన్.. తెలుగు జనాలకు ఈయన గురించి పరిచయం అక్కర్లేదు. కమెడియన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ఆయన. రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. తొలుత ప్రభుత్వ ఉద్యోగం చేసిన బాబు మోహన్ కు నాటకాలు అంటే ఎంతో ఇష్టం. ఎన్నో నాటక ప్రదర్శనలు ఇచ్చాడు. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టాడు. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి.. మొత్తం సినిమాల మీదే కాన్సెట్రేషన్ చేశాడు. నటుడిగా, కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన పెళ్లి గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించాడు.

బాబు మోహన్ తొలిసారి.. మామగారు సినిమాలో బిక్షగాడి పాత్రపోషించాడు. ఆ తర్వాత పెదరాయుడు, జంబలకడిపంబ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో చేశాడు. జనాలను తన చక్కటి కామెడీతో ఎంతో అలరించాడు. అయితే తన పెళ్లికి సంబంధించి ఎవరికీ తెలియన విషయాన్ని చెప్పాడు బాబు మోహన్. నిజానికి తనను పెళ్లి చేసుకోవడం తన భార్యకు ఇష్టం లేదట. అందుకు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకొని కొంత కాలం చాలా ఇబ్బంది పడ్డట్లు చెప్పాడు. ఇంటి దగ్గర పోరు పడలేక.. సినిమా షూటింగుల్లోనే ఉండేవాడినని చెప్పాడు. ఆ తర్వాత అంకుశం లాంటి సినిమా చేయడంతో ఎంతో పేరు వచ్చింది. అలా ఓ రోజు విమానాశ్రయం నుంచి వస్తుండగా.. అక్కడున్న జనాలు తనను గుర్తుపట్టి ఆటోగ్రాఫులు తీసుకున్నారని చెప్పాడు. అలా ఎందుకు తీసుకుంటున్నారని తన భార్య అడిగిందని చెప్పాడు. ఈ మధ్య ఓ మంచి నాటకం వేడయంతో అలా తీసుకుంటున్నట్లు చెప్పాడట.

నిజానికి తన భార్యకు తానంటే ఎందుకు ఇష్టంలేదో చెప్పాడు. సినిమాల్లో నటించడం మూలంగానే తనకు ఇష్టం ఉండేది కాదన్నాడు. ఓ సారి తన భార్యను సినిమాకు తీసుకెళ్లాడట. కర్తవ్యం సినిమా చూపించాడట. ఈ సినిమాలో బాబు మోహన్ ను చూసి ఒక్కసారి షాక్ అయ్యిందట. ఇందుకేనా మీతో జనాలు ఆటో గ్రాఫ్ తీసుకున్నారా? అని అడిగిందట. దానికి అవును అని చెప్పాడట. అప్పటి నుంచి తన భార్య తనతో హ్యాపీగా ఉండేదని చెప్పాడు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *