Breaking News

ఇన్నేళ్ల కెరీర్ లో ప్రభాస్ వదిలేసినా సినిమాలు తెలిస్తే అభిమానుల గుండే ఆగిపోద్ది

ప్ర‌భాస్.. ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. ఈశ్వ‌ర్ తో ఆయ‌న సినీ ప్రస్థానం మొద‌లైంది. ఛ‌రత్ర‌ప‌తితో స్టార్ హీరోగా ఎదిగాడు. బాహుబ‌లితో ఎవ‌రికీ అంద‌నంత ఎత్తుకు చేరాడు. ఇండియ‌న్ సూప‌ర్ స్టార్ గా గుర్తింపు పొందాడు. ఈ ప్ర‌యాణంలోనే ఆయ‌న ఎన్నో సినిమాల‌ను వ‌దులుకున్నాడు. అందులో కొన్ని క‌థ‌లు న‌చ్చ‌క రిజెక్ట్ చేయ‌గా.. మరికొన్ని డేట్స్ కుద‌ర‌క ఒప్పుకోలేదు. ఇంతకీ ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం..

*దిల్
వివి వినాయక్ దిల్ కథని మొదట ప్రభాస్ కి చెప్పాడట. కానీ పెద‌నాన్న కృష్ణంరాజు సలహాతో ప్ర‌భ‌బాస్ వ‌దులుకున్నాడ‌ట‌. ఆ తర్వాత ఇదే కథ ఎన్టీఆర్ కి వినిపించాడు వినాయక్. ఆయ‌న కూడా కొన్ని కార‌ణాల‌తో వ‌ద్ద‌నుకున్నాడు. చివరకు నితిన్ తో చేసాడు. ఈ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది.

*సింహాద్రి
రాజమౌళి సింహాద్రి కథని మొదట ప్రభాస్ తో చేయాలనుకున్నాడు. కానీ సింహాద్రి లాంటి మాస్ స్టోరీని చేయగలడా అనే డౌట్ తో ప్రభాస్ రాజమౌళి కి నో చెప్పాడట. ఈ సినిమా ఎన్టీఆర్ తో చేసి సూపర్ హిట్ కొట్టాక.. రాజమౌళితో ఎలాగైనా సినిమా చేయాలని భావించాడ‌ట ప్రభాస్ .

*కిక్
రవితేజ చేసిన సూప‌ర్ మూమీ కిక్ సినిమా కథని.. ముందుగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి ప్రభాస్ కి చెప్పాడు. కథ నచ్చింది కానీ హీరో క్యారెక్ట‌ర్ త‌న‌కు సెట్ కాద‌ని చెప్పాడ‌ట ప్ర‌భాస్.

*ఒక్కడు
మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమా ఒక్కడు. ఈ సినిమాలో నటించాల్సిందిగా ముందుగా ప్రభాస్ కు అవకాశం వచ్చిందట. కానీ తను బిజీగా ఉండటం మూలంగా ఒప్పుకోలేదట.

*ఆర్య
సుకుమార్ డైరెక్షన్లో దిల్ రాజు ప్రొడ్యూసర్ గా చేసిన సినిమా ఆర్య‌. ఈ క‌థ‌ను ప్రభాస్ కు కూడా వినిపించాడ‌ట డైర‌క్ట‌ర్. కానీ క‌థ విన్న ప్ర‌భాస్ త‌న‌కు న‌చ్చ‌లేద‌ని చెప్పాడ‌ట‌.

*జిల్
డైరెక్టర్ రాధా క్రిష్ణ జిల్ సినిమా కథ ప్రభాస్ కు ముందుగా చెప్పాడ‌ట‌. బాహుబలి కార‌ణంగా కుద‌రద‌ని చెప్పిన ఆయ‌న గోపిచంద్ ఈ కథకి బాగా సెట్ అవుతాడని చెప్పాడట.

*నాయక్
ప్రభాస్ తో చేసిన యోగి సినిమా ప్లాప్ అవడంతో మళ్ళీ ఎలాగైనా ప్రభాస్ కి హిట్ ఇవ్వాలని వివి వినాయక్ అనుకున్నాడ‌ట‌. నాయక్ కథను ప్రభాస్ కు చెప్పాడ‌ట‌. కథ అంత‌గా న‌చ్చని ప్రభాస్ ఈ మూవీకి నో చెప్పాడ‌ట‌.

*బృందావనం
ప్రభాస్ తో మున్నా సినిమా చేసిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి తన తర్వాత కథని కూడా ప్రభాస్ తో చేయాలనుకున్నాడ‌ట‌. కొరటాల శివతో కలిసి వెళ్లి క‌థ‌ చెప్పాడట. కానీ డేట్స్ కుద‌ర‌క ఈ సినిమాను వ‌దులుకున్నాడు.

*డాన్ శ్రీను
బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ క్యారెక్ట‌ర్ న‌చ్చి గోపిచంద్ మలినేని దానిలాగే డాన్ శీను కథని రాసుకున్నాడట. ప్రభాస్ కి ఈ మూవీ చేయాలని ఉన్నా డేట్స్ కుద‌రక నో చెప్పాడ‌ట‌.

*ఊసరవెల్లి
ఎన్టీఆర్ హీరోగా చేసిన ఈ సినిమా కూడా తొలు ప్రభాస్ ముందుకే వచ్చింది. డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఆయన ఈ సినిమాను వదులుకున్నాడు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *