Breaking News

ఇద్దరు పిల్లలు ఉన్న వ్యక్తిని నమ్మి మోసపోయిన హీరోయిన్

టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ గురించి అందరికీ తెలుసు. అజారుద్దీన్ తనకు పెళ్లయి ఇద్దరు పిల్లలున్నా సరే సంగీత బిజ్ లానీ అనే బాలీవుడ్ నటితో ప్రేమలో మునిగి తేలి ఆమెను వివాహం చేసుకున్నాడు. దీనికి అజ్జు భాయ్ వైఫ్ అయిన నౌరీన్ కూడా ఏమీ ఎదురు చెప్పలేకపోయింది. ఆమె కామ్ గా విడాకులు తీసుకుని అజారుద్దీన్ కు దూరంగా వెళ్లిపోయింది. దీంతో సంగీత బిజ్ ను పెళ్లి చేసుకున్న అజారుద్దీన్ 14 సంవత్సరాల తర్వాత సంగీతను వదిలించుకోవాలని ట్రై చేస్తున్నాడట. అవును అజ్జూ భాయ్ సంగీతకు కూడా హ్యాండ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అజారుద్దీన్ ప్రస్తుతం వేరే అమ్మాయితో లవ్ లో ఉన్నాడని స్వయంగా సంగీతే చెప్పడం గమనార్హం. అజారుద్దీన్ కు పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారని తెలిసి నమ్మినా కూడా తనను మోసం చేశాడని సంగీత తన బ్లాగ్ లో రాసుకొచ్చింది.

సంగీత బిజ్ లానీ 1990లలో బాలీవుడ్ ను షేక్ చేసిన అందగత్తె. అప్పట్లో చాలా మంది కుర్రాళ్లు సంగీత కోసం నిద్ర లేని రాత్రులు గడిపారు. కానీ సంగీత మాత్రం సల్మాన్ కోసం నిద్ర చెడగొట్టుకొని పరితపించింది. అవును బాలీవుడ్ కండల వీరుడు సల్లూ భాయ్ ని సంగీత లవ్ చేసింది. వీరిద్దరి ప్రేమ పెద్దవాళ్లకు తెలియడంతో వారు కూడా పెళ్లికి పచ్చ జెండా ఊపారు. కానీ ఏమయిందో ఏమో వీరి పెళ్లి పీటల వరకు వెళ్లకుండానే క్యాన్సిల్ అయింది. దీంతో సంగీత అజారుద్దీన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. సంగీతను ఓ యాడ్ షూటింగ్ లో చూసిన అజారుద్దీన్ తొలి చూపులోనే ఆమెను ఇష్టపడ్డాడు. అప్పటికే అజారుద్దీన్ కు పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా కానీ సంగీత అజారుద్దీన్ ను పెళ్లి చేసుకుంది. అజారుద్దీన్ మొదటి భార్య నౌరీన్ ఈ విషయం తెలిసి చాలా సైలెంట్ గా విడాకులు తీసుకుని అజారుద్దీన్ నుంచి దూరంగా వెళ్లిపోయింది. దీంతో వీరి కథ సుఖాంతమై పెళ్లి చేసుకున్నారు.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *