Breaking News

ఆ హీరో కొడుకు ట్యాలెంట్ గురించి తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..ఏకంగా 7 మెడల్స్

మాధ‌వ‌న్ అంటే ఇప్ప‌టి త‌రానికి పెద్ద‌గా ప‌రిచయం లేదోమో. ఎందుకంటే ఆయ‌న గ‌త ప‌దేండ్ల కింద‌ట ఓ స్టార్ గా అంద‌రికీ ప‌రిచ‌య‌స్తుడు. ఆయ‌న ఎక్కువ‌గా డబ్బింగ్ సినిమాల ద్వారానే తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు. అయినా ఆయ‌న మీద తెలుగు ప్రేక్ష‌కుల‌కు మంచి అభిమానం ఉంది. ఆయ‌న నటుడుగా తెలుగులో నేరుగా చేసిన మూవీలు అస‌లు లేవ‌ని తెలుస్తోంది. ఆయ‌న ఏ భాషలో అయినా స‌రే ఈజీగా న‌టించేస్తారు. పాత్ర‌ల‌తో సంబంధం లేకుండా న‌టించి న‌ట‌నా ప‌రంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు ఆయ‌న కొడుకు గురించి ఓ వార్త మీకోసం.

ఆయ‌న కొడుకు ఇప్పుడేమీ సినిమాల్లోకి రాక‌పోయినా కూడా అత‌గాడు స్విమ్మింగ్ పోటీల్లో త‌న స్త‌తా చాటుతున్నాడు. మాధవన్ కొడుకు వేదాంత్ ఇప్పుడు త‌న ఓన్ ట్యాలెంట్ ప్ర‌ద‌ర్శిస్తూ స్విమ్మింగ్‌లో ఏకంగా జాతీయ స్థాయిలో ఏడు పతకాల్ని సొంతం చేసుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మరిపోయింది. రీసెంట్ గా బెంగళూరు ప‌ట్ట‌ణంలోని బసవనగుడి అక్వాటిక్ సెంటర్ వేదిక‌గా నిర్వ‌హించిన జూనియర్ నేషనల్ స్విమ్మింగ్ అక్వాటిక్ చాంపియన్ షిప్ 2021 పోటీల్లో వేదాంత్ చురుగ్గా పాల్గొని త‌న ప్రతిభ‌ను చాటుకున్నాడు.

పదహారేళ్ల వ‌య‌సున్న వేదాంత్ వ‌రుస‌గా ఏడు ప‌త‌కాల‌ను కొల్ల‌గొట్ట‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారిపోయింది. 800 మీటర్ల నుంచి 1500 మీటర్ల ప్రీస్టైల్ దాకా ఆయ‌న ప‌త‌కాల‌ను సొంతం చేసుకున్నాడు. ఇందులో 4×100 ఫ్రీస్టైల్ రిలే 4×200 ఫ్రీస్టైల్ రిలే ఈవెంట్లలో వేదాంత్ త‌న ప్ర‌తిభ‌ను చాటుకుని వీటిల్లో ర‌జ‌త పతకాలు ద‌క్కించుకున్నాడు. కాగా ఇత‌ర 100 నుంచి అలాగే 200 దాంతో పాటు 400 మీటర్ల ఫ్రీస్టైల్ ఈవెంట్ల‌లో వేదాంత్ కాంస్య పతకాలను సొంతం చేసుకున్నాడు. కాగా వేదాంత్‌ను ఇప్పుడు అంద‌రూ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *