Breaking News

ఆ హీరోయిన్ ప్రేమలో పడి జీవితాన్ని నాశనం చేసుకున్న రఘువరన్

రఘువరన్.. తెలుగు సినిమా పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు, తమిళ సినిమా పరిశ్రమల్లో ఎన్నో అద్భుత పాత్రలు పోషించి గొప్ప పేరు సంపాదించుకున్నాడు. సుమారు 200లకు పైగా సినిమాల్లో నటించాడు. విలన్, తండ్రి, పొలిటీషియన్ ఏ పాత్ర అయితేనేం.. అద్దినట్లు ఒదిగిపోతాడు ఆయన. పాత్ర ఏదైనా తన నటతో ప్రాణం పోసేవాడు. రఘువరన్ తండ్రిగా పవన్ కల్యాణ్ కొడుకుగా సుస్వాగతం అనే సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో తండ్రిగా ఆయన కొడుకు ఇచ్చే గౌరవం, ప్రేమ మాటల్లో చెప్పలేనిది. సినిమా చూస్తున్నంత సేపు రఘువరన్ పాత్ర ఎంతో ఆకట్టుకుంటుంది.

రఘువరన్ సినిమా కెరీర్ గురించి కాసేపు పక్కన పెడితే ఆయన వ్యక్తిగత జీవితం గురించి కాసేపు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం.. 1996లో ఆయన ప్రముఖ నటి, డబ్బింగ్ ఆర్టిస్టు రోహిణిని పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్ల తర్వాత ఓ అబ్బాయి జన్మించాడు. 2004లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఇద్దరి మధ్య వివాదాలు చెలరేగడంతో కలిసి ఉండటం కుదరదని భావించి విడిపోయారు. రోహిణిని పెళ్లి చేసుకున్న రఘువరన్ నిత్యం మద్యం మత్తులో మునిగిపోయేవాడు. అయితే తన తాగుడు నచ్చకే రోహిణి విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఆయన మద్యానికి బానిస కావడానికి ఓ హీరోయిన్ కారణం అనే టాక్ వచ్చింది. రఘువరన్ అప్పట్లో ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి తన ప్రేమను తిరస్కరించడంతో మద్యానికి బానిస అయ్యాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఓ పెద్ద ఇంటికి కోడలు అయ్యింది.

అటు తెలుగు, తమిళ సినిమా పరిశ్రమల్లో స్టార్ హీరోల అందరి సినిమాల్లో నటించాడు రఘువరన్. ప్రతి హీరో చేత ఆయన ప్రశంసలు అందుకున్నాడు. సుమారు 200ల చిత్రాల్లో నటించిన ఆయన అనారోగ్యంతో చనిపోయాడు. 2008 మార్చి 19న రక్తంలో చెక్కెర స్థాయి పడిపోయింది. దీంతో ఆయన చనిపోయాడు. రఘువరన్ మరణం పట్ల తెలుగు, తమిళ సినీ జనాలు, ఆయన అభిమానులు కన్నీటి పర్యంతం అయ్యారు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *